WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం వెతకాల్సిన పనిలేదు! బర్త్‌డే అలర్ట్స్ కూడా..
WhatsApp New Feature Update Telugu: వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త Contacts Tab ద్వారా కాంటాక్ట్స్‌ను త్వరగా సెర్చ్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో ఉన్నవారిని, బర్త్‌డే రిమైండర్లను ఒకే చోట చూసే అవకాశం ఉండొచ్చు.

WhatsApp New Feature Update Telugu: వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు తమ కాంటాక్ట్స్‌ను మరింత సులభంగా వెతికి, నిర్వహించుకునేలా ప్రత్యేకంగా Contacts Tabను అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ట్యాబ్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న కాంటాక్ట్స్, పుట్టినరోజు రిమైండర్లు వంటి పలు వివరాలను ఒకే చోట చూడొచ్చు. టెక్ న్యూస్ వెబ్‌సైట్ WABetaInfo నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ యాప్ కోసం వాట్సాప్ ప్రస్తుతం ఈ కొత్త Contacts Tabను అభివృద్ధి చేస్తోంది. అయితే ఇది ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. ప్రస్తుతం బీటా టెస్టర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు.
ఒకే చోట కాంటాక్ట్స్
కొత్త Contacts Tabలో వాట్సాప్ కాంటాక్ట్స్ అన్నింటినీ ఒకే స్క్రీన్‌పై చూడొచ్చని తెలుస్తోంది. ఇందులో పైభాగంలో ప్రత్యేకమైన Search Bar ఉంటుంది. దీని ద్వారా పేరు, ఫోన్ నంబర్ లేదా యూజర్‌నేమ్ ఆధారంగా కాంటాక్ట్‌ను త్వరగా వెతుక్కోవచ్చు. కాంటాక్ట్ లిస్ట్‌ను యూజర్లు తమకు నచ్చిన విధంగా కూడా అమర్చుకునే అవకాశం ఉండొచ్చు. Activity ఆప్షన్‌ను ఎంచుకుంటే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్న కాంటాక్ట్స్ ముందుగా కనిపిస్తాయి. అదే Alphabetical ఆప్షన్‌ను ఎంచుకుంటే పేర్ల అక్షరక్రమం ఆధారంగా కాంటాక్ట్స్ కనిపిస్తాయి.
ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో తెలుసుకోవచ్చు
ఈ కొత్త ట్యాబ్‌లో కాంటాక్ట్ ప్రొఫైల్ ఫొటో పక్కన గ్రీన్ డాట్ కనిపించే అవకాశం ఉంది. దీని ద్వారా ఆ వ్యక్తి ప్రస్తుతం వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా యూజర్ ప్రైవసీ సెట్టింగ్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా తమ Online Statusను ఇతరులకు కనిపించకుండా సెట్ చేసుకుంటే వారి ప్రొఫైల్‌పై గ్రీన్ డాట్ కనిపించదు. అలాగే Last Seen స్టేటస్‌ను దాచిన కాంటాక్ట్స్‌ను ఇటీవల యాక్టివిటీ ఆధారంగా గుర్తించే అవకాశం ఉండదు.
పుట్టినరోజు రిమైండర్లు కూడా!
Contacts Tabలో మరో ఆసక్తికరమైన ఫీచర్‌గా Birthday Reminders ఉండనున్నట్లు సమాచారం. ఒక కాంటాక్ట్‌కు ఆ రోజు పుట్టినరోజు ఉంటే.. వారి పేరుతో పాటు కేక్ ఎమోజీ, “Birthday today” అనే లేబుల్ కనిపించవచ్చు. దీంతో ప్రత్యేకంగా ఆ వ్యక్తి చాట్‌ను వెతకాల్సిన అవసరం లేకుండానే Contacts Tab నుంచే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సంభాషణను ప్రారంభించవచ్చు.
Meta AI, Invite a Friend కూడా
కొత్త Contacts Tabలో కాంటాక్ట్స్‌తో పాటు ఇతర షార్ట్‌కట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కాంటాక్ట్ లిస్ట్ కింద Meta AIను యాక్సెస్ చేసేందుకు లింక్ ఉండొచ్చని సమాచారం. అలాగే చివర్లో “Invite a friend” ఆప్షన్ ఉండవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా ఇంకా వాట్సాప్ ఉపయోగించని వ్యక్తులకు ఆహ్వాన లింక్‌ను పంపే అవకాశం ఉంటుంది.
ప్రైవసీ సెట్టింగ్స్‌కు అనుగుణంగానే..
వాట్సాప్‌లో ఇప్పటికే ఉన్న ప్రైవసీ నియమాలను కొత్త Contacts Tab కూడా అనుసరించనున్నట్లు తెలుస్తోంది. అంటే యూజర్ తన Online Status లేదా Last Seen వివరాలను దాచుకుంటే.. కొత్త ట్యాబ్‌లో కూడా ఆ సమాచారం ఇతరులకు కనిపించదు. ప్రస్తుతం ఈ Contacts Tab ఫీచర్ ఆండ్రాయిడ్ కోసం అభివృద్ధి దశలో ఉంది. బీటా వెర్షన్‌లో కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. భవిష్యత్తులో వాట్సాప్ విడుదల చేసే అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అధికారిక విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
