AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన

సైబీరియాలో ప్లేగు వ్యాప్తి భయాల నేపథ్యంలో రెండో వ్యక్తి మృతి చెందినట్లు వస్తున్న వార్తలను రష్యా ఖండించింది. అవి తప్పుడు సమాచారమని పేర్కొంటూ.. ప్రజలు అధికారిక ఆరోగ్య సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్‌ వెల్లడించే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కాగా రష్యాలో ప్లేగు వ్యాధి వ్యాప్తిపై ఇప్పటికే..

సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
Russia On Reports Of 2nd Plague Death
Srilakshmi C
|

Updated on: Oct 08, 2026 | 9:39 AM

Share

మాస్కో, అక్టోబర్‌: సైబీరియాలోని ప్లేగు పరిశోధనా ప్రయోగశాలలో పనిచేసే 28 ఏళ్ల ఉద్యోగిని అనుమానాస్పద న్యుమోనియాతో మృతి చెందడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న దర్యా షిపిలోవా గత శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి కారణమైన న్యుమోనియా ఏ కారణంగా వచ్చిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటన నేపథ్యంలో వందలాది మందిని క్వారంటైన్‌లో ఉంచి, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రష్యా మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో సైబీరియాలో ప్లేగు వ్యాప్తి చెందుతోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా రష్యా నుంచి మరింత సమాచారం కోరింది.

అయితే రష్యా ఆరోగ్య నియంత్రణ సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్ మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సైబీరియాలో అంటువ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం లేదని ప్రకటించింది. మృతురాలితో సంబంధం ఉన్న వారిలో ఇప్పటివరకు ప్లేగు లక్షణాలు ఏవీ గుర్తించలేదని తెలిపింది. దర్యా షిపిలోవాతో సంబంధం ఉన్నవారిలో 90 శాతం మందిని క్వారంటైన్‌ నుంచి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 5 వేల ప్రయోగశాల పరీక్షలు నిర్వహించినప్పటికీ ప్రమాదకరమైన వ్యాధికారకాలు ఏవీ గుర్తించలేదని స్పష్టం చేశారు. షిపిలోవాకు ప్లేగు సహా తాను పనిచేసే ప్రమాదకర అంటువ్యాధులపై వ్యాక్సినేషన్‌ జరిగినట్లు కూడా వెల్లడించారు.

రెండో మరణం వార్తలపై రష్యా ఖండన

ఈ ఘటనకు సంబంధించి మరో వ్యక్తి కూడా మరణించాడంటూ రష్యాలోని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. అవి తప్పుడు సమాచారమని పేర్కొంది. క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ.. ఈ పరిస్థితికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తల్లో అత్యధిక భాగం వాస్తవం కాదని అన్నారు. ప్రజలు అధికారిక ఆరోగ్య సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్‌ ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించారు. ఈ ఘటనకు బయోవెపన్‌ కారణమై ఉండొచ్చన్న అనుమానాలపైనా చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీనిపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి అనుమానం తమకు లేదని, అయితే పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయని అన్నారు. రష్యా ఈ అంశంపై పెద్దగా సమాచారం ఇవ్వడం లేదని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని రష్యా చెబుతోందన్నారు. ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడేందుకు తాను ఫోన్‌ కాల్‌ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. కోవిడ్‌-19 మహమ్మారి తర్వాత కారణం స్పష్టంగా తెలియని న్యుమోనియా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి. అయితే వ్యక్తిగత న్యుమోనియా కేసులకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించలేని సందర్భాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రష్యాలో చోటుచేసుకున్న ఘటనపై అందిన సమాచారం ఆధారంగా ప్రజలకు ముప్పు తక్కువగానే ఉందని WHO తొలుత అంచనా వేసింది. అయితే రష్యా అధికారుల నుంచి తగినంత సమాచారం అందకపోవడంతో పూర్తి స్థాయి ప్రమాద అంచనా వేయడం సాధ్యం కాలేదని ఆ సంస్థ వెల్లడించింది. అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) కూడా పరిస్థితిని పర్యవేక్షించేందుకు, అవసరమైతే ప్రయాణికులను పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం అమెరికాకు ముప్పు చాలా తక్కువగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Follow Us
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే