Bread Manchurian: ఇంటికి అతిధులు వచ్చారా.. నిమిషాల్లో బ్రెడ్ మంచురియా చేసి పెట్టండి.. రెసిపీ మీ కోసం

వెజ్ మంచూరియన్ లేదా చికెన్ మంచూరియన్ ఒక రుచికరమైన వంటకం. ఇది ఫేమస్ ఇండో చైనీస్ రెసిపీ. ఇది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో మిగిలిన బ్రెడ్ ఉన్నప్పుడు.. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే టీ టైం బ్రెడ్ స్నాక్ గా బ్రెడ్ మంచూరియన్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా సులభం .. నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

Bread Manchurian: ఇంటికి అతిధులు వచ్చారా.. నిమిషాల్లో బ్రెడ్ మంచురియా చేసి పెట్టండి.. రెసిపీ మీ కోసం
Bread Manchurian Recipe

Updated on: Jun 14, 2025 | 10:50 AM

ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అటువంటి ఫ్యూజన్ వంటకాల్లో ప్రసిద్ధ ఇండో చైనీస్ వంటకాలు ఒకటి. ఈ వంటల్లో మంచూరి వంటకాలు రారాజు అని చెప్పవచ్చు. మంచూరియాని వెజ్, నాన్ వెజ్ లతో మాత్రమే కాదు.. బ్రెడ్ మంచూరియా కూడా చేసుకోవచ్చు. అవును మీరు ఇప్పటి వరకూ పనీర్, వెజ్ , చికెన్, రొయ్యల మంచురియా వంటిని తినే ఉంటారు. అయితే ఈ రోజు బ్రెడ్ తో చేసిన మంచురియాని ట్రై చేయండి. దీనిని చాలా సింపుల్ గా తక్కువ సమయంలోనే టేస్టీగా చేసుకోవచ్చు. రెసిపీ మీ కోసం ..

బ్రెడ్ మంచూరియా తయారీకి కావలసిన పదార్థాలు

  1. బ్రెడ్ ముక్కలు – 6 నుంచి 8
  2. కార్న్‌ఫ్లోర్ – 2 టీస్పూన్లు
  3. మైదా – 2 టీస్పూన్లు
  4. పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
  5. ఇవి కూడా చదవండి
  6. వెల్లుల్లి – 4-5 (తరిగినవి)
  7. ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగిన)
  8. క్యాప్సికమ్ – 1 (తరిగినది)
  9. టమాటా సాస్ – 2 టీస్పూన్లు
  10. చిల్లీ సాస్- 1 టీస్పూన్
  11. సోయా సాస్ – 1 టీస్పూన్
  12. ఉప్పు – రుచికి సరిపడా
  13. నూనె – వేయించడానికి

బ్రెడ్ మంచూరియన్ తయారీ విధానం:

  1. ముందుగా బ్రెడ్ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదా పిండిగా చేసుకోండి
  2. తరువాత బ్రెడ్ పిండిలో కొంచెం నీరు, మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపండి
  3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి
  4. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి.. వేడి నూనెలో బ్రెడ్ బాల్స్ ని డీప్ ఫ్రై చేయండి.
  5. ఈ బాల్స్ బంగారు రంగులోకి మారి క్రిస్పీగా మారే వరకు బాగా వేయించి బయటకు తీయండి.
  6. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టి.. కొంచెం నూనె వేసి వేడి చేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ వేసి బాగా వేయించండి
  7. ఇప్పుడు ఈ మిశ్రమానికి టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి కలపండి.
  8. దీని తరువాత ఈ మిశ్రమానికి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి.. గ్రేవీ కోసం కొంచెం నీరు పోసి కొన్ని నిమిషాలు ఉడికించాలి.
  9. ఇప్పుడు ఈ గ్రేవీలో వేయించి పెట్టుకున్న బ్రెడ్ మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలపండి.

చివరగా బ్రెడ్ మంచూరియా ప్లేట్ లోకి తీసుకుని తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ తో అలంకరించి సర్వ్ చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఈ బ్రెడ్ మంచురియాని తింటారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..