మటన్ లివర్ Vs చికెన్ లివర్.. వీటిలో ఏది సూపర్‌ఫుడ్.. ఎవ్వరికీ తెలియని నిజాలు..

చికెన్ లివర్, మటన్ లివర్ రెండూ కూడా అత్యంత పోషకమైన ఆహారాలే. వీటిలో ఐరన్, విటమిన్ B12, ప్రోటీన్, విటమిన్ A పుష్కలంగా ఉండి రక్తహీనత తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే మటన్ లివర్‌లో పోషకాల సాంద్రత ఎక్కువగా ఉండగా, చికెన్ లివర్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

మటన్ లివర్ Vs చికెన్ లివర్.. వీటిలో ఏది సూపర్‌ఫుడ్.. ఎవ్వరికీ తెలియని నిజాలు..
Chicken Liver Vs Mutton Liver

Updated on: May 23, 2026 | 3:14 PM

నాన్ వెజ్ ప్రియులు మటన్, చికెన్‌ను ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఆదివారంతోపాటు.. దాదాపు అన్ని రోజులలో కూడా మటన్, చికెన్, ఫిష్ ను తింటారు. అయితే.. కర్రీ, ఫ్రై, తోపాటు పలు ప్రత్యేకమైన పద్దతులతో నాన్ వెజ్ ఫుడ్స్ ను వండుకుంటారు. అయితే.. కొంతమంది మటన్, చికెన్ లోని పలు పార్ట్స్ ను ఇష్టంగా తింటారు. అలాంటి వాటిలో లివర్ (కాలేయం) ఒకటి.. మటన్ – చికెన్ లివర్ ఫ్రై, లివర్ కర్రీతోపాటు.. పలు రకాలుగా వండుకుని ఆస్వాదిస్తారు.. అయితే.. లివర్ అత్యంత పోషకమైన ఆహారం.. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను పుష్కలంగా అందిస్తాయి. లివర్ లో B12 తోపాటు.. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటితోపాటు విటమిన్ A, ప్రోటీన్ కూడా ఉంటుంది.

అయితే, చికెన్, మటన్ లివర్ తినడం ఆరోగ్యానికి మంచిది.. రక్తహీనత సమస్య ఉన్నవారికి చికెన్, మటన్ లివర్ రెండూ చాలా మేలు చేస్తాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. కంటి చూపు, రోగ నిరోధక శక్తి పెంచడానికి, కండరాల నిర్మాణానికి – శారీరక బలానికి వీటిలోని అధిక ప్రోటీన్ ఉపయోగపడుతుంది. అయితే, రెండింటిలో పోషకాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. చాలా మంది మటన్ లివర్ లేదా చికెన్ లివర్ మంచిదా..? అనే సందేహాలు కలుగుతుంటాయి..

లివర్ పోషకాలు..

మటన్ లివర్ లో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, ఐరన్, రాగి, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు బి12, A, B, D తోపాటు ప్రోటీన్ కూడా ఉంటుంది.

చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్స్, మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫోలేట్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి.. ముఖ్యంగా చికెన్ లివర్ లో సెలీనియం మంచి మొత్తంలో ఉంటుంది.

చికెన్ లివర్ vs మటన్ లివర్:

చికెన్ లివర్‌లో సాధారణంగా మటన్ లివర్ కంటే తక్కువ క్యాలరీలు, కొవ్వు ఉండవచ్చు. అయితే, మటన్ లివర్‌లో పోషకాల సాంద్రత (Nutrient Density) ఎక్కువగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ సమస్యలు: మటన్ లివర్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు లేదా హై-కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలి.

గర్భిణీలు: గర్భిణీలు విటమిన్ A అధికంగా ఉండటం వల్ల వైద్యుల సలహా మేరకు మాత్రమే పరిమిత మోతాదులో తీసుకోవాలి.

అంతేకాకుండా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు లివర్ ను ఎక్కువగా తినకూడదు.

వారానికి ఎన్నిసార్లు తినొచ్చు:

సాధారణంగా ఆరోగ్యవంతులు వారానికి 100-200 గ్రాముల వరకు చికెన్, మటన్ లివర్ ను ఒకసారి తీసుకోవడం మంచిది. పరిమితంగా తిసుకుంటే.. మంచిదే కానీ.. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు..

మటన్ లివర్, చికెన్ లివర్ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే.. అయితే, చికెన్ లివర్ తో పోలిస్తే.. మటన్ లివర్ లో ఎక్కువగా పోషకాలు దాగుంటాయి.. అయితే, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ముందు వైద్య నిపుణులను సంప్రదించి లివర్ ను తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us