AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: జాగ్రత్త.. ఈ విటమిన్ లోపం ఉంటే గుండెపోటు తప్పదట.. మీకు ఉందేమో చెక్‌చేసుకోండి!

గుండెపోటు రావడానికి కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా డయాబెటీస్ వంటి వ్యాధులే కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని విటమిన్‌ లోపాలు కూడా మన గుండెపోటుకు ప్రధాన కారణాలు అనే విషయం చాలా మందికి తెలియదు. అవును మన శరీరంలో ఒక విటమిన్‌ తగ్గడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఇంతకు ఆ విటమిన్‌ ఏంటి, అది గుండెపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Heart Attack: జాగ్రత్త.. ఈ విటమిన్ లోపం ఉంటే గుండెపోటు తప్పదట.. మీకు ఉందేమో చెక్‌చేసుకోండి!
Heart Attack Symptoms
Anand T
|

Updated on: Sep 08, 2025 | 6:54 PM

Share

ఈ మధ్య చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటు రావడానికి కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా డయాబెటీస్ వంటి వ్యాధులే కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ విటమిన్ డి లోపం కూడా గుండె జబ్బులకు ఒక ప్రధాన కారణమని మీకు తెలుసా? అవును మన శరీరంలో ఈ విటమిన్ తగ్గితే, అది గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ విటమిన్‌ లోపం గుండెపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం.

విటమిన్ డి లోపం, గుండె జబ్బుల మధ్య సంబంధం ఏమిటి ?

విటమిన్‌ డి అనేది మన శరీరానికి అనేక రకాలుగా ప్రయోజనాలను కల్గిస్తుంది. మన బాడీలో కాల్షియం, భాస్వరం స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది. కానీ కొన్ని సార్లు ఇది ఎముకలను గుండెను కూడా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని లోపం ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు, రక్తపోటు అసమతుల్యత చెందుతుంది దీని వల్ల రక్త నాళాలు ఉబ్బడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి క్రమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది.

విటమిన్ డి లోపం యొక్క లక్షణాలు

తరచూ మీకు అలసటగా అనిపిస్తున్నట్లయితే అది విటమిన్‌ D లోపానికి సంకేతం కావచ్చు. అలాగే ఎముకలు, కండరాల నొప్పి, తరచుగా అనారోగ్యం, నిద్ర సమస్యలు, నిరాశ లేదా మానసిక స్థితిలో మార్పులు, పైన పేర్కొన్న ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తే విటమిన్ డి లోపం ఉందని అర్థం.

విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలి?

  • రోజూ నిద్రలేచిన వెంటనే కనీసం 15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోండి.
  • మీ ఆహారంలో పాలు, పెరుగు, గుడ్లు, పుట్టగొడుగులు, కొవ్వు చేపలను చేర్చుకోండి
  • అలాగే వైద్యుడి సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోండి
  • గుండెపోటును నివారించడానికి, మీ విటమిన్ డి స్థాయిలను కాలానుగుణంగా తనిఖీ చేసుకోండి
  • మీకు విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే చికిత్స తీసుకోండి.
  • అలాగే, మీ దినచర్యలో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేర్చుకోండి
  • విటమిన్ డి లోపాన్ని విస్మరించడం ప్రమాదకరం. మీరు గుండెపోటు ప్రమాదాన్ని నివారించాలనుకుంటే, మీ జీవనశైలిని
  • మార్చుకోండి. అలాగే తగినంత మొత్తంలో విటమిన్ డి తీసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.