భారతీయులు టీని వినోద పానీయంగా కాకుండా మూలికా ఔషధంగా భావించారు. టీ పొడి, నీరు, పాలు, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, మూలికలను ఉపయోగించి రకరకాల రుచులతో తయారు చేస్తారు. అలంటి టీలో ఒకటి మసాలా టీ. దీనిని సుగంధ చాయ్ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. సుగంధ ద్రవ్యాలు, పంచదార, పాలతో తయారు చేసే టీని ఎక్కువగా చాయ్ ప్రియులు తాగుతారు. ఇంట్లోని వంటగదిలో దొరికే మసాలా పొడిని తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలు. ఎప్పుడు మాసాలా టీ కావాలంటే అప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకుని తాగవచ్చు. ఈ రోజు చాయ్ మసాలా పొడి రెసిపీ గురించి తెలుసుకుందాం..
చాయ్ మసాలా పొడి తయారీ విధానం: ముందుగా శొంఠిని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి. పాన్ లో శొంఠి ముక్కలు వేసి తక్కువ మంటపై వేయించండి. తర్వాత ఆ శొంఠిని పక్కకు పెట్టి.. అదే బాణలిలో లవంగాలు, మిరియాలు, యాలకులు వేసి వేయించి.. తర్వాత దాల్చిన చెక్క, సోంపు వేసి వేయించి చివరగా, తులసి, గులాబీ రేకులు వేసి ఈ మసాలా దినుసులను ఒక నిమిషం పాటు వేయించి గ్యాస్ ఆఫ్ చేయండి.
ఈ వేయించిన మసాలా దినుసులను వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకుని ఈ సుగంధ ద్రవ్యాలు పూర్తిగా చల్లబరచాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా శొంఠి ముక్కలు వేసి పొడి చేసుకుని.. తర్వాత ఆ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొండి. తర్వాత చల్లారిన మసాలా దినుసులు వేసి మెత్తగా అయ్యేవరకూ గ్రైండ్ చేయండి. చివరగా వేయించిన మసాలా పొడిలో శొంఠి పొడిని వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి ఈ మసాలా పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార నివ్వండి. తర్వాత ఈ చాయ్ మసాలా పొడిని ఒక గాజు సీసాలో పోసుకుని నిల్వ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మసాలా చాయ్ ని తయారు చేసుకుని తాగవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..