Carrot halwa recipe: రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే క్యారెట్ హల్వా చేసుకోవచ్చు.. దీని తయారీ విధానము ఏమిటంటే..!

|

Mar 24, 2021 | 6:12 PM

క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది . విటమిన్ ఎ లోపము...

Carrot halwa recipe: రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే క్యారెట్ హల్వా చేసుకోవచ్చు.. దీని తయారీ విధానము ఏమిటంటే..!
Carrot Halwa
Follow us on

Carrot halwa recipe : క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది . విటమిన్ ఎ లోపము వల్ల వచ్చే వ్యాదులని నివారిస్తుంది. ఈ క్యారెట్ తో కూరలు చేసుకోవచ్చు.. అంతేకాదు ఎంతో రుచికరమైన స్వీట్ కూడా చేసుకోవచ్చు.. క్యారెట్ హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చు.. అయితే ఇందులో స్టైల్ వారిదే! హల్వా బాగుండాలి – కుటుంబ సభ్యులంతా మెచ్చుకుని ఆనందంతో తినాలి .. ఈరోజు క్యారెట్ హల్వా ఈజీగా తయారు చేసుకొనే విధానం తెలుసుకుందాం..!

కావాల్సిన పదార్ధాలు :

క్యారెట్ : ఒక్క కిలో
పంచదార : రెండు కప్పులు
నెయ్యి కావాల్సినంత
యాలకులు
డ్రై ఫ్రూట్స్
పాలు : చిక్కటిపాలు అరగ్లాసు

తయారీ విధానం :

ముందుగా క్యారెట్ ను చెక్కు తీయండి. ఇక ఎండుకొబ్బరి కోరే ప్లేట్ తో “క్యారెట్లు” కోరండి. తర్వాత అడుగు మందంగా ఉన్న కడాయి లేదా నాన్ స్టిక్ తవా స్టవ్ మీద పెట్టి మంట సిమ్ లో ఉంచండి. అందులో కోరి ఉంచిన క్యారెట్ వేసి – మూత పెట్టండి. క్యారెట్ లో ఉన్న నీటి శాతం వల్ల ఓ ఐదు ఆరు నిమిషాలకు మెత్తగా ఉడుకుతుంది. లేదా మరో రెండు నిమిషాలు పడుతుంది. అడుగంటకుండా కలుపుతూ మెత్తగా ఉడికించండి. తర్వాత దానిలో రెండు కప్పులు పంచదార అందులో పోసి గరిటతో చక్కగా కలయతిప్పండి. కొంచెం పాలు కూడా పోసుకోండి.
దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మిశ్రమంలో ఓ కప్పు మంచి నెయ్యి వెయ్యండి. సీఎం లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. నీటి ఆవిరి తగ్గి మెల మెల్లగా హల్వా గట్టి [పడిన తర్వాత స్టౌ ఆర్పేసి దించేయండి..
అందులో ఓ స్పూన్ యాలుక్కాయల పొడి డ్రై ఫ్రూట్స్ చక్కగా నేతిలో వేయించి డెకరేట్ చేయండి. అంతే ఏంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ..

Also Read: How to Store Bananas: అరటిపండ్లు తాజాగా నిల్వ ఉంచుకోవడానికి సింపుల్ చిట్కాలు ఏమిటంటే

 పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ క్రేజీ అప్డేట్ .. ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన చిత్ర యూనిట్