Bun Dosa Recipe: రెగ్యులర్ టిఫిన్స్ తో బోర్ కొట్టిందా.. పది నిమిషాల్లో టేస్టీ టేస్టీ బన్ దోస తయారు చేసుకోండి.. రెసిపీ మీ కోసం

దక్షిణ భారతీయులకు ఇష్టమైన అల్పాహరాల్లో దోశకు ప్రముఖ స్థానం ఉంది. దీనిని దోశ, దోసె, దోసై, అట్టు అంటూ ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క రకంగా పిలుస్తారు. ఈ దోశను పూజల్లో నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఒకప్పుడు తెలుగువారికి ఇష్టమైన ఈ దోస ఇప్పుడ విశ్వవ్యాప్తంగా మారింది. దోసెలు ఇప్పుడు రకరకాలుగా దొరుకుతున్నాయి. ఈ రోజు బన్ దోస తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

Bun Dosa Recipe: రెగ్యులర్ టిఫిన్స్ తో బోర్ కొట్టిందా.. పది నిమిషాల్లో టేస్టీ టేస్టీ బన్ దోస తయారు చేసుకోండి.. రెసిపీ మీ కోసం
Bun Dosa Recipe

Updated on: Apr 03, 2025 | 8:43 PM

కారం దోస, ఉల్లి దోస , మసాలా దోస, పన్నీర్ దోస , ఎగ దోస ఇలా ఎన్నో రకాలుగా దోసాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఈ దోశలను మినప పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. అయితే దోస ప్రియులకు సరికొత్త దోస ను ఈ రోజు పరిచయం చేస్తున్నాం.. ఇది బన్ దోస.. దీనిని మినప పిండి లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇది చాలా మెత్తగా రుచిగా ఉంటుంది. ఈ బన్ దోసను కొబ్బరి చట్నీతో కలిపి తింటే అబ్బా ఏమి రుచి అనాల్సిందే.

కావాల్సిన పదార్థాలు:

ఉప్మా రవ్వ(సుజీ రవ్వ)- రెండు కప్పులు

పెరుగు- ఒక కప్పు

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ- ఒకటి

పచ్చిమిర్చి- రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూన్

కారం – కొంచెం

జీలకర్ర- రెండు స్పూన్లు

ఆవాలు- రెండు స్పూన్లు

కరివేపాకు- రెండు రెమ్మలు

కొత్తిమీర- ఒక చిన్న కట్ట

ఉప్పు – రుచికి సరిపడా

ఈనో – ఒక ప్యాకెట్

నూనె –

శనగ పప్పు- ఒక స్పూన్

మినప పప్పు – చిన్న స్పూన్

ఎండు మిరపకాయలు- రెండు

తయారీ విధానం: ఈ బన్ దోసను తయారు చేసుకోవడం చాలా సులభం. ఒక గిన్నె తీసుకుని రెండు కప్పుల సుజీ రవ్వ వేసుకుని అందులో పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి.. నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత శనగ పప్పు, మినప పప్పు వేసి జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయ ముక్కలు వేసి తాలింపు వేసుకోవాలి అదే బాణలిలో నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని వేయించాలి.

ఇప్పుడు నానిన రావ్వని మిక్సీ గిన్నెలో వేసి మిక్స్ పట్టుకోవాలి. దోశ పిండిలా రుబ్బుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ దోస పిండిలో ఉప్పు, ఈనో వేసి తగినంత నీరు పోసి దోస పిండిలా చేసుకోవాలి. ఆ పిండిలోకి ఉల్లిపాయలతో వేసిన తాలింపును వేసి బాగా కలపాలి.

ఇప్పుడు పాన్ పెట్టుకుని పాన్ వేడి ఎక్కిన తర్వాత నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత దోస పిండి వేసుకోవాలి. సన్నటి మంట మీద ఆ దోశను రెండు వైపులా కాల్చుకోవాలి. అప్పుడు దోస పొంగి బన్ దోసగా మారుతుంది. అంతే రుచికరమైన బన్ దోశ రెడీ. దీనిని వేడి వేడిగా ఉన్నప్పుడు కొబ్బరి చట్నీతో తింటే ఆహా ఏమి రుచి అంటూ లోట్టలేసుకుంటూ తింటారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..