Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cabbage: క్యాబేజీ తినేవారు జాగ్రత్త..! ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం..?

Cabbage: క్యాబేజీ కూరగానే కాకుండా ఫాస్ట్ ఫుడ్, సలాడ్లు, చిరుతిళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మనం ఎంతో ఇష్టంతో తినే క్యాబేజీ కొన్నిసార్లు మన ప్రాణాలనే తీయవచ్చు.

Cabbage: క్యాబేజీ తినేవారు జాగ్రత్త..! ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం..?
Cabbage
Follow us
uppula Raju

|

Updated on: Sep 11, 2021 | 10:14 PM

Cabbage: క్యాబేజీ కూరగానే కాకుండా ఫాస్ట్ ఫుడ్, సలాడ్లు, చిరుతిళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మనం ఎంతో ఇష్టంతో తినే క్యాబేజీ కొన్నిసార్లు మన ప్రాణాలనే తీయవచ్చు. ఎందుకంటే అందులో టేప్‌వార్మ్‌ అనే పురుగు ఉంటుంది. అది మన శరీరానికి చాలా హానికరం. ఇవి కడుపులోకి వెళితే విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. రక్త ప్రవాహంతో శరీరంలోని ఇతర భాగాలకు చేరుతాయి. కొన్నిసార్లు అవి మెదడుకు కూడా చేరే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి. క్యాబేజీని పచ్చిగా తినే వ్యక్తులలో టేప్‌వార్మ్ శరీరంలోకి చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇది ఒక రకమైన మైక్రోస్కోపిక్ వార్మ్. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రోగులు తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వచ్చారు. అలాంటి సందర్భంలో వారికి మూర్ఛ వచ్చేది. దీంతో చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వారి శరీరంలో అప్పటికే అధిక సంఖ్యలో టేప్‌వార్మ్‌ చేరిపోయాయి. తరువాత చాలామంది క్యాబేజీ తినడం పూర్తిగా మానేశారు. టేప్‌వార్మ్‌ల భయం కారణంగా క్యాబేజీకి దూరంగా ఉండటం మంచిదని ప్రజలు భావించారు. ఆహార నిర్వహణ పద్ధతుల్లో వ్యత్యాసం కారణంగా దాని ఇన్ఫెక్షన్ కేసులు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి.

టేప్‌వార్మ్‌లు మానవ శరీరంలోకి కూరగాయలు, సలాడ్‌ల రూపంలో చేరుతాయి. ఇవి మనకు రెండు విధాలుగా హాని చేస్తాయి. చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి అవి మనకు కనిపించవు. క్యాబేజీని సరిగ్గా కడిగిన తర్వాత కూడా అది ఆకుల మధ్యలో ఇరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితిలో మనం పచ్చి క్యాబేజీని తీసుకున్నప్పుడు అది మన శరీరంలో చేరే అవకాశం అత్యధికంగా ఉంటుంది.

Geeta Samota: సాహసమే ఆమె ఊపిరి.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది.. చరిత్ర సృష్టించింది.!

Maitri Patel: పట్టుదలతో పేదరికాన్ని ఓడించింది.. సవాళ్లను ఎదుర్కొంటూ 19 ఏళ్లకే పైలెట్‏గా మారిన మైత్రీ పటేల్..

JP Nadda: ప్రధాని మోదీ నాయకత్వంలో కులతత్వం, మతతత్వం, వారసత్వం, రాచరికం అన్నీ అంతమొందాయ్ : జేపీ నడ్డా