JP Nadda: ప్రధాని మోదీ నాయకత్వంలో కులతత్వం, మతతత్వం, వారసత్వం, రాచరికం అన్నీ అంతమొందాయ్ : జేపీ నడ్డా
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో కులతత్వం, మతతత్వం, వారసత్వం, రాచరికం అన్నీ అంతమొందాయన్నారు
PM Modi – JP Nadda: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో కులతత్వం, మతతత్వం, వారసత్వం, రాచరికం అన్నీ అంతమొందాయన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వీటిన్నిటినీ దాటి దేశంలో అభివృద్ధి ముందుకు వచ్చిందని నడ్డా న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుందని జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీ ఎన్నికలపై చేసిన సర్వేలు కూడా ఇదే మాట చెబుతున్నాయని.. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
మోదీ నాయకత్వంలో 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాలను గెలుచుకుందని చెప్పిన నడ్డా.. అలాగే 2014, 2019 సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీనే గెలిచిందని గుర్తు చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని… తద్వారా మరోసారి యూపీలో కమల ప్రభుత్వమే ఏర్పడుతుంది నడ్డా ధీమా వ్యక్తం చేశారు.
Read also: Huzurabad: హుజూరాబాద్‌లో ఇంటెలిజెన్స్ వర్గాల మకాం .. నోటిఫికేషన్ మీద భారీ సస్పెన్స్