Weight Loss Tips: బరువును తగ్గించడంలో సహాయపడే 5 ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్ ఆహారాలు ఏమిటో తెలుసా..

Weight Loss Tips: శరీరంలోని కొవ్వు బరువు తగ్గడానికి యాంటీఆక్సిడెంట్లు మంచి సహాయకారి అని పరిశోధనలు, అధ్యయనాల ద్వారా తెలిసింది. ప్రస్తుత జనరేషన్ లో ఎక్కువగా సన్నగా సన్నజాజి తీగలా ఉండడానికి..

Weight Loss Tips: బరువును తగ్గించడంలో సహాయపడే  5 ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్ ఆహారాలు ఏమిటో తెలుసా..
Weight Loss Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2021 | 6:49 PM

Weight Loss Tips: శరీరంలోని కొవ్వు బరువు తగ్గడానికి యాంటీఆక్సిడెంట్లు మంచి సహాయకారి అని పరిశోధనలు, అధ్యయనాల ద్వారా తెలిసింది. ప్రస్తుత జనరేషన్ లో ఎక్కువగా సన్నగా సన్నజాజి తీగలా ఉండడానికి యువతీ యువకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  దీంతో కొవ్వు తగ్గడానికి బరువు తగ్గి సన్నగా అవుతారని ఎవరు ఏమి చెప్పినా వెంటనే యువత దానిని అనుసరిస్తున్నారు. అయితే అందరి శరీర తీరు ఒకేలా ఉండదు.. ఒకొక్క శరీర తత్వం కలిగి ఉంటారు.. తమ శరీర తత్వానికి అనుగుణంగా  ఒకొక్క విధంగా బరువు అదుపులోకి వస్తుంది.  ఈరోజు కొవ్వు కరగడానికి ఎఫెక్టివ్ పదార్ధాల గురించి తెలుసుకుందాం..

గ్రీన్ టీ: 

బరువు తగ్గించే వాటిల్లో గ్రీన్ టీ ప్రధానమైనది.. ముఖ్యమైనది. గ్రీన్ టీ లో కేటీచిన్ అనే ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు జీవక్రియలను మేరుపరుస్తుంది.  క్యాన్సర్‌తో పోరాడే తత్వాన్ని కూడా గ్రీన్ టీ కలిగి ఉంది.  ఈ గ్రీన్ టీ రెండు రకాలు: గ్రీన్ టీ-కెఫిన్ ,  నాన్-కెఫిన్ ప్రేరిత గ్రీన్ టీ.  ఎవరైనా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శరీరంలోని కేలరీలను బర్న్ చేయడంలో గ్రీన్ టీ మంచి సహాయకారి.

బ్లాక్ టీ: 

గ్రీన్ టీ తర్వాత.. బరువు తగ్గించేందుకు ఎక్కువగా బ్లాక్ టీ వైపు మొగ్గు చూపుతారు. బ్లాక్ టీ,  గ్రీన్ టీ రెండూ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. బ్లాక్ టీ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అధిక కొవ్వు ఉన్న భోజనం తింటే బ్లాక్ టీ మంచి సహాయకారి.

కూరగాయల రసం: 

ఈ రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు లేదా క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి కొవ్వు తగ్గించడంలో  కీలక పాత్ర పోషిస్తుంది. దుంపలు, క్యారెట్లు, టమోటాలు ,  ఆకుకూరలు వంటి కూరగాయలు ఖనిజాలు, విటమిన్లు అందిస్తాయి. అంతేకాదు హైడ్రేషన్ స్థాయిని ఉంచడంలో సహాయపడతాయి.

నట్స్: 

నట్స్‌లో కొవ్వు ,  కేలరీలు అధికంగా ఉంటాయి. ఊబకాయ ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన శక్తిని కలిగి ఉంటాయి. అందుకనే నట్స్  జంక్ ఫుడ్ కంటే ఆరోగ్యకరమైనది  మార్కెట్లో సులభంగా లభిస్తాయి.  ఆరోగ్యకరమైన ప్రోటీన్లు , ఖనిజాల ఉండడంతో నట్స్ కు మంచి డిమాండ్ ఉంది.

బ్లూబెర్రీస్: 

బ్లూ బెర్రీస్ లో అధిక శాతం 85% నీటిని కలిగి ఉన్నాయి.  అంతేకాదు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ లతో పాటు విటమిన్  సి ,  కె లు కూడా బ్లూబెర్రీ అధికంగా ఉన్నాయి.  కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అవి శరీరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ స్థాయిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రక్తపోటు, డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్నవారికి బ్లూబెర్రీలు మంచి సహాయకారి.

Also Read: ఖైరతాబాద్ గణేశుడికి 11 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయం.. ఈ ఏడాది బ్రేక్…తాపేశ్వరం నుంచి అందని లడ్డు