Health Tips :రాగులతో బిందాస్ ఆరోగ్యం.. అందానికి కూడా !.. ఈ విషయాలు తెలిస్తే ఖచ్చితంగా తింటారు..

|

Jun 14, 2023 | 7:41 AM

రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరానికి బలం, శక్తిని అందిస్తాయి. రాగుల్లో ఉండే..

Health Tips :రాగులతో బిందాస్ ఆరోగ్యం.. అందానికి కూడా !.. ఈ విషయాలు తెలిస్తే ఖచ్చితంగా తింటారు..
Ragi
Follow us on

ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్రయోజ‌నాలను కలిగించేవి సిరి ధాన్యాలు. ఇందులో రాగులు కూడా అతి ముఖ్యమైన‌వి. రాగులతో ప్రజలు రకరకాల ప‌దార్థాల‌ను చేసుకుని తింటుంటారు. ఎక్కువగా రాగుల‌తో జావ చేసుకుని తాగుతుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో రాగి జావా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలకు పరిష్కారంగా రాగులు ఉపయోగపడతాయి. రాగుల్లో ఉండే అమినోయాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం ఆకలి తగ్గిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తయారు చేసే ఆహారాలు జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు మంచి బలవర్దకమయిన ధాన్యం. ఇందులోని కాల్షియం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి తోడ్పడుతుంది. రాగులతో ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మధుమేహ బాధితులకు రాగులతో చేసిన ఆహార పదార్థాలు మంచి ఔషధంగా పనిచేస్తుంది. రాగి జావ‌ను తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. రాగుల వల్ల కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.

రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులకు దూరం చేస్తుంది. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరానికి బలం, శక్తిని అందిస్తాయి. రాగుల్లో పాలిఫినోల్స్ వంటి యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరుస్తాయి. తద్వారా వృద్ధాప్య ప్రక్రియ తగ్గి నిత్య యవ్వనంగా ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..