Bellam Appalu: హనుమాన్ అనుగ్రహం కోసం మంగళవారం బెల్లం అప్పాలు నైవేధ్యంగా పెట్టండి.. రెసిపీ మీ కోసం..

|

Feb 05, 2024 | 8:37 PM

మంగళవారం వచ్చిందంటే చాలు నైవేద్యంగా హనుమంతునికి ప్రీతికరమైన బెల్లం అప్పాలను పెడతారు. 108 అప్పాలను దండగా గుచ్చి తమ ఆరాధ్య దైవానికి అలంకరించి.. అనంతరం వాటిని ప్రసాదంగా అందరికి పంచిపెడతారు. అయితే ఈ అప్పాలను ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసి స్వామి వారికీ నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజు బెల్లం అప్పాల తయారీ విధానం గురించి తెలుసుకుందాం.. 

Bellam Appalu: హనుమాన్ అనుగ్రహం కోసం మంగళవారం బెల్లం అప్పాలు నైవేధ్యంగా పెట్టండి.. రెసిపీ మీ కోసం..
Bellam Appalu
Follow us on

హనుమంతుడిని భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని.. తమలపాకులు, సింధూరం సమర్పించి.. నైవేద్యంగా శనగలు, బెల్లం అప్పాలను సమర్పిచడం వలన ఆంజనేయస్వామి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. మంగళవారం వచ్చిందంటే చాలు నైవేద్యంగా హనుమంతునికి ప్రీతికరమైన బెల్లం అప్పాలను పెడతారు. 108 అప్పాలను దండగా గుచ్చి తమ ఆరాధ్య దైవానికి అలంకరించి.. అనంతరం వాటిని ప్రసాదంగా అందరికి పంచిపెడతారు. అయితే ఈ అప్పాలను ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసి స్వామి వారికీ నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజు బెల్లం అప్పాల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

అప్పాల తయారీకి కావలసిన పదార్ధాలు:

  1. బియ్యం పిండి – ఒక కప్పు
  2. గోధుమపిండి – ఒక కప్పు
  3. కొబ్బరి తురుము – అరకప్పు
  4. బొంబాయి రవ్వ – ఒక కప్పు
  5. ఇవి కూడా చదవండి
  6. బెల్లం తురుము – రెండు కప్పులు
  7. నీరు – మూడు కప్పులు
  8. నూనె – వేయించడానికి సరిపడే
  9. యాలకుల పొడి – ఒక టీ స్పూన్
  10. నెయ్యి – సరిపడినంత

తయారీ విధానం:  ఒక గిన్నె తీసుకుని అందులో జల్లెడ పట్టిన బియ్యప్పిండి, గోధుమపిండి, బొంబాయి రవ్వని వేసుకుని బాగా కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి మందమైన గిన్నె పెట్టి..  అందంగా ఉన్న గిన్నె పెట్టుకొని మూడు కప్పుల నీరు పోసి.. అందులో తీసుకున్న బెల్లం తురుము వేసి కరిగే వరకూ కలపాలి. కొంచెం మరుగుతున్నప్పుడు యాలకుల పొడి, కొబ్బరి తురుము, కొంచెం నెయ్యి వేసుకోవాలి.

మరుగు పట్టిన తర్వాత బెల్లం నీటిలో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని నెమ్మదిగా పోస్తూ ఉండలు పట్టకుండా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి ఉడికించి.. తర్వాత మళ్ళీ ఆ మిశ్రమాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసి.. ఆ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఆ పిండిని బాగా కలపాలి. పిండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని వాటిని మరీ మందంగా లేదా మరీ పల్చగా కాకుండా అప్పాలుగా ఒత్తుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి బాణలి పెట్టి.. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనె వేడి ఎక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న అప్పాలను వేసి మంట తగ్గించి వేయించుకోవాలి. అలా అప్పాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకుని తీసుకోవాలి. అంతే హనుమంతుడికి ఇష్టమైన బెల్లం అప్పాలు రెడీ.. వీటిని స్వామివారికి ప్రసాదంగా పెట్టి.. పిల్లలకు పెట్టండి.. భక్తి, శక్తి రెండు ఇస్తాడు హనుమయ్య..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..