Aratikaya Podi Kura : అరటి కాయలలో రెండు రకాలున్నాయి. ఒకటి పండినవి తినడానికి.. రెండోది కేవలం కూర చేసుకోవడానికి. ఇక అధిక పోషక విలువలు కలిగిన ఈ అరటి కాయతో పాటు అరటి పువ్వు, దూట అన్నీ కూడా కూరగా చేసుకుంటారు. ఇక లేత అరటి కాయలు అయితే అజీర్ణం చేయవు. ఈ అరటితో రాకరకాల వంటలు చేస్తారు. ఈరోజు అరటికాయ పొడి చేసుకోవడం తెలుసుకుందాం..!
అరటికాయలు 4
పచ్చి శనగపప్పు
రెండు ఎండుమిర్చి
ఉప్పు,
పసుపు
కారం
మొదట అరటికాయలు బాగా కడిగి తొక్కతో సహా కుక్కర్లో ఉంచి నీరుపోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి దించాలి. అవి చల్లారిన తర్వాత అరటికాయ తొక్కలు తీసి లోపలి భాగాన్ని సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
తర్వాత బాణలిని గ్యాస్ స్టౌ మీద పెట్టి వేడి ఎక్కిన తర్వాత నూనె వేసి ఆవాలు చిటపటలాడించి కాస్త పచ్చి శనగపప్పు , రెండు ఎండుమిర్చి వేసి వేయించి తర్వాత తరిగిన ఉడికిన అరటికాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు,పసుపు వేసి కలియబెట్టి మూతపెట్టాలి. వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు కొంచెం కూరపొడిని వేసి ఉప్పు చూసుకుని కొంచెం సేపు తర్వాత దించేయాలి.
అంతే రుచికరమైన అరటికాయ పొడి రెడీ ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.
పచ్చి శెనగపప్పు 200 గ్రాములు
ధనియాలు ఓ టేబుల్ స్పూన్
జీలకర్ర 2 టీస్పూన్ లు
ఎండుమిరప కాయలు 25
వీటన్నిటిని వేరు వేరుగా నూనెల లేకుండా వేయించాలి. అనంతరం వీటన్నిటితో పాటు ఎండు కొబ్బరి కోరు కొంచెం వేసి బరకగా మిక్సీ పట్టాలి. ఈ పొడిని ఓ బాటిల్ లో భద్రపరచి, కూరలు వండేటప్పుడు కూరంతా అయిన తరువాత చివర్లో ఓ రెండు చెంచాల పొడి చల్లితే కూరకు మంచి రుచి వస్తుంది.
Also Read :