Gongura Chicken: గోదావరి జిల్లాల స్పెషల్ గోంగూర చికెన్ కర్రీని ఇలా చేసి పెట్టండి.. ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా..
సంక్రాంతి అంటే కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందునా గోదావరి జిల్లా వాసులు ఐతే కొత్త అల్లుడికి రకరకాల వంటకాలతో విందు ఓ రేంజ్ లో ఏర్పాటు చేస్తారు. గోంగూర ఆకు కూరల్లో వెరీ వెరీ స్పెషల్. గోంగూరతో చట్నీనే కాదు గోంగూర పప్పు, గోంగూర పులుసులు, గోగూర రొయ్యలు, గోంగూర మటన్ , గోంగూర చికెన్ వంటి అనేక రుచికరమైన వంటలు చేస్తారు. మరి ఈరోజు సంక్రాంతి కి ఆంధ్ర స్పెషల్ నోరూరించే గోంగూర చికెన రెసిపీ గురించి తెలుసుకుందాం..
సంక్రాంతి వస్తుందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్నవారు తమ సొంత ఊరుకు చేరుకుంటారు. చుట్టాలు, స్నేహితులతో సందడిగా గడిపిస్తారు. అంతేకాదు సంక్రాంతి అంటే కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందునా గోదావరి జిల్లా వాసులు ఐతే కొత్త అల్లుడికి రకరకాల వంటకాలతో విందు ఓ రేంజ్ లో ఏర్పాటు చేస్తారు. గోంగూర ఆకు కూరల్లో వెరీ వెరీ స్పెషల్. గోంగూరతో చట్నీనే కాదు గోంగూర పప్పు, గోంగూర పులుసులు, గోగూర రొయ్యలు, గోంగూర మటన్ , గోంగూర చికెన్ వంటి అనేక రుచికరమైన వంటలు చేస్తారు. మరి ఈరోజు సంక్రాంతి కి ఆంధ్ర స్పెషల్ నోరూరించే గోంగూర చికెన రెసిపీ గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
గోంగూర
చికెన్
ధనియాల పొడి
అల్లం వెల్లుల్లి పేస్ట్
పసుపు
కారం
ఉప్పు
నూనె
పచ్చిమిర్చి
టమాటాలు
ఉల్లిపాయలు
గరం మసాలా
కరివేపాకు
కొత్తిమీర
బిర్యాని ఆకు
దాల్చిన చెక్క
ఏలకులు
తయారీ విధానం:
ముందుగా చికెన్ ను తీసుకుని శుభ్రం చేసుకుని ఒక గిన్నె లో వేసి.. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసి మార్నేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసుకుని శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులూ వేసుకుని బాగా మెత్తగా అయ్యేవరకూ మగ్గించాలి. గోంగూర పేస్ట్ అయ్యేలా మగ్గించిన తర్వాత ఈ పేస్ట్ ని ఒక గిన్నెలో తీసుకుని పక్కకు పెట్టుకోండి. తర్వాత మల్లి కొంచెం నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలకులు, నిలువగా కట్ చేసిన పచ్చి మిర్చి, వేసి కొంచెం సేపు వేయించి అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకూ వేయించండి. ఇప్పుడు ఒక స్పున్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించి.. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసి పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గేవరకూ వేయించండి. టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మార్నేట్ చేసుకున్న చికెన్ ను వేసి కొంచెం సేపు వేయించి ఇప్పుడు మూత పెట్టి స్విమ్ లో వేయించుకోండి. చికెన్ ముక్క బాగా మెత్తగా అయ్యాక ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసి కలిపి ఉప్పు చూసుకుని తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. తర్వాత అందులో ధనియాల పొడి వేసి కలిపి.. మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ పైకి తేలేవరకూ గోంగూర చికెన్ ను ఉడికించండి. చివరగా గరం మసాలా,, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ను వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అంతే టేస్టీ టేస్టీ పుల్లపుల్లని గోంగూర చికెన్ రెడీ.. కొత్త అల్లుడికి ఈ కూరని చపాతీలోకి అన్నం లోకి లేదా బిర్యానీ లోకి అయినా వేసి అందించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..