మన చుట్టూ చాలా మంది టీ ప్రియులు కనిపిస్తారు. చాలామందికి గంటకొకసారి టీ తాగకపోతే వారికి రోజు గడవదు. టీ లేకుంటే వారికి రోజులో ఏ పని సాగదు. ఇలా రోజుకు ఎన్నోసార్లు టీ తాగుతూ ఉంటారు. అయితే, చక్కెర టీ తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది క్రమంగా, ఊబకాయం, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల అందులో ఉన్న చెక్కర శాతం క్యాలరీలను మన శరీరంలోకి వెళ్ళేలా చేస్తాయి. మన శరీరంలో కేలరీలు అధికంగా ఉండటం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతారు. అధిక బరువు పెరగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే టీ లో చెక్కర కు బదులుగా బెల్లం వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బెల్లం టీ రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అలా అయితే, బెల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..
బెల్లం టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు తగ్గడం:
బరువు తగ్గే క్రమంలో చాలా మంది టీ తాగడం మానేస్తారు . అయితే చక్కెరకు బదులు బెల్లం టీ తాగితే శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియ:
బెల్లంలోని విటమిన్లు, ఖనిజాలు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి . బెల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల అనేక పొట్ట సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
రక్తహీనత సమస్యకు పరిష్కారం:
చాలా మంది వివిధ కారణాల వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనిని నివారించడానికి, పాలు-బెల్లం, బెల్లం టీ ఉత్తమ పరిష్కారం. బెల్లంలోని ఐరన్ కంటెంట్ కారణంగా, బెల్లం టీ తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుందని చెబుతారు.
టీ లో బెల్లం తో పాటు కొద్దిగా అల్లం, మిరియాలు వేసుకొని తాగడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధక శక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. బెల్లం లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..