Soy Milk: సోయా పాలతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకుంటే మీకే మంచిది..

| Edited By: Anil kumar poka

Jan 23, 2023 | 1:25 PM

వీటిల్లో సోయా పాలకు ఇటీవల కాలంలో డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే ఇది పూర్తి శాకాహారమే కాకుండా తక్కువ కేలరీలతో పాటు అధిక ప్రోటీన్‌, కాల్షియం, పొటాషియం కలిగి ఉంది. వీటివల్ల ఒనగూరే ఆరోగ్యప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Soy Milk: సోయా పాలతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకుంటే మీకే మంచిది..
Soya Beans and Milk
Follow us on

ప్రతి రోజూ పాలు తాగడం ఆరోగ్యదాయకం.. చిన్నా పెద్దా తేడా లేదు.. పేద, ధనిక తారతమ్యం లేదు అందరూ తాగుతుంటారు. ఒకప్పుడు పాలు అంటే కేవలం ఆవు లేదా గేదె గుర్తొచ్చొవి. వాటి నుంచే వచ్చే పాలనే అధికంగా వినియోగించుకునే వారు. అయితే ఇప్పుడు ఆ పాలకు కూడా ప్రత్యామ్నాయాలను కనిపిస్తున్నాయి. సోయా, బాదం, బియ్యపు పాలు, కొబ్బరిపాలు వంటి వేర్వేరు రూపాల్లో లభ్యమవుతున్నాయి. వీటిల్లో సోయా పాలకు ఇటీవల కాలంలో డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే ఇది పూర్తి శాకాహారమే కాకుండా తక్కువ కేలరీలతో పాటు అధిక ప్రోటీన్‌, కాల్షియం, పొటాషియం కలిగి ఉంది. వీటివల్ల ఒనగూరే ఆరోగ్యప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోయా పాలవల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను సారి చూద్దాం..

ఎముకలకు పుష్టి.. సోయా పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోయా మిల్క్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మహిళల్లో ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ముందస్తు మోనోపాజ్ సమయంలో ఆస్టియోపోరిసిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె పదిలం.. మోనో అన్‌ సాచురేటెడ్‌, పాలీ అన్‌ సాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు సోయా పాలలో ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది ప్లాస్మా లిపిడ్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

అదుపులో బరువు.. సోయా పాలలోని అధిక ప్రోటీన్‌, ఫైబర్‌ కంటెంట్‌ శరీర బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఇది బాడీ మాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ)పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కండరాలను అదుపులో ఉంచుతోంది. ఊబకాయం, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

జుట్టు పెరుగుదలకు.. జుట్టు పలచబడిపోయి.. ఎన్ని షాంపూలు వాడినా ఫలితం లేకుండా పోయిందా? అయితే మీకు సోయా పాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జుట్టు ఊడిపోవడాన్ని నియంత్రించి, మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది.

చర్మ సౌందర్యానికి.. సోయా మిల్క్ హైపర్‌ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. చర్మానికి తేమను అందిస్తుంది. ముదురు మచ్చలు, చర్మం రంగు మారడం వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..