Aloo Bukhara Benefits : ఆలుబుఖార పండ్ల అద్భుత ప్రయోజనాలు..! వర్షాకాలంలో తింటే చాలా మంచిది..

| Edited By: Phani CH

Jul 07, 2021 | 9:36 AM

Aloo Bukhara Benefits : ఎరుపు-నీలం రంగులో కనిపించే ఆలూబుఖరా పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ పండ్లు ఎక్కువగా రెయినీ సీజన్‌లో

Aloo Bukhara Benefits : ఆలుబుఖార పండ్ల అద్భుత ప్రయోజనాలు..! వర్షాకాలంలో తింటే చాలా మంచిది..
Aloo Bukhara
Follow us on

Aloo Bukhara Benefits : ఎరుపు-నీలం రంగులో కనిపించే ఆలూబుఖరా పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ పండ్లు ఎక్కువగా రెయినీ సీజన్‌లో కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లలో పండిస్తారు. ఈ తీపి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కణాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

1. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఆలూబుఖరా పండ్లు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ భయాలను నివారిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

2. మలబద్ధకం నుంచి ఉపశమనం
లూబుఖరా పండ్లలో ఇసాటిన్, సార్బిటాల్ ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఎండిన పండ్లను తినాలి.

3. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది
ఆలు బుఖరా పండ్ల పైన ఎర్రటి, నీలం రంగు వర్ణద్రవ్యం, ఆంథోసైనిన్స్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. రొమ్ము క్యాన్సర్, గొంతు, నోటి క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.

4. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
ఆలు బుఖరా పండ్లు ఐరన్‌ను పీల్చుకునే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఐరన్ కూడా ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తికి అవసరం. ఆలు బుఖరా పండ్లు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

5. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది
ఈ పండులో కరిగే ఫైబర్ ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధించడానికి సహాయపడుతుంది.

6. ఎముకలకు మంచిది
అనేక అధ్యయనాల ప్రకారం.. ఆలుబుఖరా పండ్లు ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో బోరాన్ ఉంటుంది. ఇది ఎముక సాంద్రతను కాపాడటానికి, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైనది. ఈ పండులో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.

Adah Sharma: సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్న హాట్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

India vs Sri Lanka: జీరో నుంచి మొదలుపెడతా.. ఐపీఎల్ లో ఆడినట్లే.. లంకలోనూ రిపీట్ చేస్తా: టీమిండియా యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్

CM JAGAN: వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు జిల్లాల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం