Wedding Health Tips: వెడ్డింగ్ సీజన్‌లో ఇలాంటి డైటింగ్ ప్లాన్ చేసుకుంటే.. ఆరోగ్యం ఇక మీ చేతుల్లోనే..

Wedding Health Tips: వెడ్డింగ్ సీజన్‌లో ఇలాంటి డైటింగ్ ప్లాన్ చేసుకుంటే.. ఆరోగ్యం ఇక మీ చేతుల్లోనే..
Food Tips

Wedding Season Food Tips: చలికాలం ప్రారంభమైంది.. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కూడా ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మనమందరికీ రుచికరమైన, ఇష్టమైన ఆహార పదార్థాలను

Shaik Madarsaheb

|

Dec 06, 2021 | 6:58 PM

Wedding Season Food Tips: చలికాలం ప్రారంభమైంది.. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కూడా ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మనమందరికీ రుచికరమైన, ఇష్టమైన ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది. దీంతోపాటు శుభకార్యాల్లో పలు ఆహార పదార్థాలకు నో చెప్పడం కూడా కష్టమే.. ఎందుకంటే వాటిని చూస్తేనే నోరురుతుంది. అయితే.. అసలే చలికాలం, ఆపై శుభకార్యాలు దీంతో బరువు తీవ్రంగా పెరగడం మాత్రం ఖాయం. ఇలాంటి సందర్భాల్లో బరువు బాగా పెరిగి చాలామంది తెగ వర్కవుట్లు చేస్తుంటారు. అయితే.. ముఖ్య శుభకార్యాల సమయంలో బరువు మెయింటెయిన్ చేస్తే.. పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాటించడం కొంచెం సవాలుగా ఉన్నప్పటికీ.. ఆహారం ఎంపిక.. స్మార్ట్ ఆలోచనలతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వింటర్ వెడ్డింగ్ సీజన్‌లో మన బరువును సరిగ్గా ఉంచుకోవడంపై న్యూక్రోస్ వ్యవస్థాపకురాలు సాక్షి బక్షి పలు సలహాలు, సూచనలు చేశారు. ఇప్పుడు ఆ ఆరోగ్య చిట్కాలేంటో తెలుసుకుందాం..

కార్యక్రమానికి ముందు.. శుభకార్యానికి ముందు రాత్రి వేళల్లో ఎల్లప్పుడూ తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కేలరీలు తక్కువగా ఉన్నప్పుడే ఆకలిని ఎక్కువసేపు అదుపులో ఉంచుకోవచ్చు. దీంతోపాటు కార్బోహైడ్రేట్‌లను కూడా చేర్చడం ముఖ్యం. కూరగాయలు, పండ్లకు సంబంధించిన సలాడ్‌లు, సూప్‌లు తీసుకోవాలి. అధిక-కొవ్వు సూప్‌లకు, క్రీంలకు దూరంగా ఉండాలి.

లీన్ ప్రోటీన్లను ఎంచుకోండి.. చలికాలంలో బయట తినే సమయాల్లో వీలైనంత ఎక్కువ వేడిగా ఉన్న ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. లీన్ ప్రొటీన్.. అంటే.. పనీర్, సోయా, పప్పు మొదలైనవి తీసుకోవాలి. చేపలు, చికెన్ మొదలైనవి తీసుకోవడం కూడా మంచిది.

కేలరీలను సమతుల్యం చేసుకోవాలి.. రాత్రివేళల్లో డిన్నర్ పార్టీలు ఉన్న సమయంలో.. పండ్లు, కూరగాయలతో కూడిన సులభమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం తీసుకోవాలి. రాత్రి భోజనం భారీగా ఉన్నక్రమంలో.. అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమతుల్యం అయి.. రోజంతా శరీరానికి కేలరీలు అందుతాయి. అయితే.. బయటికి వెళ్లే ముందు కొద్దిపాటి భోజనం తీనాలి. అతిగా తింటే.. ఉదర సమస్యలు తలెత్తుతాయి.

చిన్న పరిమాణంలో తినండి పార్టీలలో లేదా డిన్నర్ బఫే ఉంటే.. చిన్న క్వార్టర్ ప్లేట్‌ని ఉపయోగించాలి. ఇలా చేస్తే.. ఆహార పరిమాణాన్ని మెరుగ్గా నియంత్రించడానికి వీలవుతుంది. ఎక్కువ తిన్నామనే భావన కలుగుతుంది.

హైడ్రేటెడ్ గా ఉండండి ముఖ్యమైన విషయం ఏమిటంటే చలికాలంలో ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉండాలి. ఎండా కాలంలో అయితే.. తరచూ దాహం వేస్తుంది. అయితే.. చలికాలం దాహాన్ని ఎక్కువగా గుర్తించలేం.. ఇది మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీంతో తలనొప్పి, ప్రేగు సమస్యలు, చర్మ సమస్యలు మొదలైనవి తెలెత్తుతాయి. గంటకు కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి. రోజులో దాదాపు 12 నుండి 16 గ్లాసుల వరకు నీరు తాగాలి. ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే.. శరీరంలో క్యాలరీలను అదుపులో ఉంచుకోవడానికి పానీయంతో పాటు ఒక గ్లాసు నీటిని ప్రత్యామ్నాయంగా తాగాలి. ఆల్కాహాల్ మోతాదుకు.. రెండు, మూడు భాగాల నీటితో తాగాలని సూచనలు చేశారు.

Also Read:

Chana Benefits: చలికాలంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలా.. అయితే వీటిని తినండి.. ఎలా తీసుకోవాలో తెలుసా..

Health Tips: వీటితో కలిపి గుడ్లను అస్సలు తీసుకోకండి.. ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu