Tips for Silky Hair: జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా, సిల్కీగా ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి..

|

Oct 15, 2024 | 6:21 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ చేసే సమస్యల్లో జుట్టు గురించి కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న రోజుల్లో ఎవరికైనా సరే జుట్టు అనేది విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. జుట్టు గ్రోతో కూడా ఆగిపోతుంది. పౌష్టికరమైన ఆహారాలు తింటే జుట్టు రాలడం తగ్గి.. ఆరోగ్యంగా పెరుగుతుంది. అదే విధంగా కొందరి మహిళల జుట్టు పొడిబారిపోయి.. నిర్జీవంగా జీవం కోల్పోయినట్టు ఉంటుంది. అలా కాకుండా సిల్కీగా, పట్టుకుచ్చులా ఉండాలని..

Tips for Silky Hair: జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా, సిల్కీగా ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి..
Hair care
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ చేసే సమస్యల్లో జుట్టు గురించి కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న రోజుల్లో ఎవరికైనా సరే జుట్టు అనేది విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. జుట్టు గ్రోతో కూడా ఆగిపోతుంది. పౌష్టికరమైన ఆహారాలు తింటే జుట్టు రాలడం తగ్గి.. ఆరోగ్యంగా పెరుగుతుంది. అదే విధంగా కొందరి మహిళల జుట్టు పొడిబారిపోయి.. నిర్జీవంగా జీవం కోల్పోయినట్టు ఉంటుంది. అలా కాకుండా సిల్కీగా, పట్టుకుచ్చులా ఉండాలని అనుకుంటారు. ఇలా కూడా మనం జుట్టును మార్చుకోవచ్చు. కేవలం కొన్ని రకాల టిప్స్ ఫాలో చేస్తే సరిపోతుంది. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ జుట్టు స్మూత్‌గా, సిల్కీగా మారడం పక్కా. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

గోరు వెచ్చటి నీటిని వాడండి:

చాలా మంది తల స్నానం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. అయితే చల్ల నీటితో లేదంటే బాగా వేడిగా ఉండే నీటితో చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలి పోతుంది. పొడిబారిపోతుంది కూడా.. అలా కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. తలకు ఒత్తుగా నూనె రాసుకుని.. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో చేస్తే.. జుట్టు మెత్తగా మారుతుంది.

ఆయిల్ మసాజ్:

చర్మానికే కాకుండా జుట్టుకు కూడా సమయం ఇస్తూ ఉండాలి. డబుల్ బాయిలింగ్ పద్దతిలో జుట్టుకు గోరు వెచ్చని ఆయిల్‌తో మర్దనా చేయాలి. ఓ గంట సేపు ఆగిన తర్వాత హెడ్ బాత్ చేయాలి. తలస్నానం చేసే సమయంలో కేవలం షాంపూ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ కండీషర్ కూడా పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే జుట్టు మెత్తగా, సిల్కీగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

షాంపూ చేశాక..

తల స్నానం చేసేటప్పుడు కూడా చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. షాంపూ చేశాక కొన్ని నీళ్లను మాత్రమే తలపై నుంచి వేసుకుంటారు. అలా కాకుండా తలపై ఉండే షాంపూ నుగర పూర్తిగా పోయేంత వరకు నీళ్లు వేసుకోవాలి. లేదంటే తల బిరుసుగా, పొడిబారిపోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..