AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలిచ్చే తల్లులు డెంగ్యూ, మలేరియా బారిన పడితే.. బిడ్డకు పాలు ఇవొచ్చా.. నిపుణుల సలహా ఏమిటంటే

పిల్లలు పుట్టిన తర్వాత తల్లులు తమ కంటే తమ పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్న తరుణంలో ఈ జ్వరం వచ్చినప్పుడు బిడ్డకు పాలివ్వాలా వద్దా అని శిశివుకి పాలు ఇచ్చే ప్రతి తల్లి ఆందోళన చెందుతోంది. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల బారిన పడ్డ తల్లి.. తన పాలు పిల్లలకు ఇస్తే జ్వరం వచ్చే ప్రమాదం ఉంటుందా? నిపుణుల నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాల గురించి తెలుసుకుందాం.

పాలిచ్చే తల్లులు డెంగ్యూ, మలేరియా బారిన పడితే.. బిడ్డకు పాలు ఇవొచ్చా.. నిపుణుల సలహా ఏమిటంటే
Breastfeeding
Surya Kala
|

Updated on: Oct 15, 2024 | 5:51 PM

Share

పుట్టిన బిడ్డకు 6 నెలల వచ్చే వరకు తల్లి పాలు బిడ్డకు ఉత్తమంగా పరిగణించబడతాయి. అయితే చాలా మంది తల్లులు తమ పిల్లలకు ఎక్కువ నెలలు తల్లిపాలను ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఏ తల్లి అయినా తన బిడ్డకు పాలు ఇస్తుంటే.. ఆ సమయంలో తల్లి బాధపడే అన్ని రోగాలు ఆ శిశివుకి సోకే ప్రమాదం ఉందని భావిస్తారు. అయితే పాలిచ్చే తల్లి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే తల్లి ఆరోగ్యం కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్న వేళ ప్రతి తల్లి తన బిడ్డకు పాలివ్వాలా వద్దా అనే ఆందోళనకు గురవుతోంది.

నిపుణులు ఏమి చెప్పారంటే

డెంగ్యూ, మలేరియా లేదా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు తల్లి బిడ్డకు పాలివ్వవచ్చని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగంలో డైరెక్టర్ ప్రొఫెసర్ (హెచ్‌ఎజి) డాక్టర్ సుభాష్ గిరి చెప్పారు. తల్లికి సీజనల్ వ్యాధులు సోకినా.. బిడ్డను తల్లి నుంచి దూరంగా ఉంచకూడదు. ఎందుకంటే నవజాత శిశువుకు తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. తల్లిపాలు బిడ్డకు రోగనిరోధక శక్తిని ఇస్తాయి. తల్లి పాలు పిల్లలకు ఆహారంగా ఇవ్వడం ద్వారా ఈ జ్వరం పిల్లలకు సోకదు.

ఈ కాలంలో బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం మరింత ముఖ్యమైనదిగా మారుతుందని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఇది పిల్లల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ ఇఇస్తాయి. అందువల్ల తల్లి తన పాలను బిడ్డకు ఎలాంటి భయం ఇవ్వొచ్చు. అయితే ఈ సమయంలో తల్లి తాను తీసుకునే ఆహారం, పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తద్వారా తల్లికి ఎటువంటి బలహీనత కలగదు.

ఇవి కూడా చదవండి

పాలిచ్చే తల్లీ ఈ విషయాలు గుర్తుంచుకోండి

  1. డెంగ్యూ, మలేరియా బారిన పడిన స్త్రీ నిర్జలీకరణ సమస్యను కూడా ఎదుర్కొంటుంది. కనుక పాలిచ్చే తల్లి తగినంత మోతాదులో పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకోసం నీళ్లు, పాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, పండ్లరసాలు వంటివి తీసుకుంటూ ఉండాలి.
  2. జ్వరం కారణంగా బలహీనంగా అనిపించకుండా ఉండటానికి తినే ఆహారంలో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇంటిలో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి. గంజి, కిచడీ తినడం కూడా ప్రయోజనకరం.
  3. పిల్లలను దోమల నుండి సురక్షితంగా ఉంచండి. దీని కోసం దోమతెరలు ఉపయోగించండి. సాయంత్రం సమయంలో కిటికీలు, తలుపులు మూసివేయండి.
  4. పాలు ఇచ్చే స్త్రీ బలహీనంగా భావిస్తే, వైద్య సలహా మేరకు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)