AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting tips: మీ చిన్నారులకు డైపర్స్‌ వేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

చిన్నారులకు డైపర్లను ఉపయోగించడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా డైపర్లను వేస్తున్నారు. అయితే డైపర్లను ఉపయోగించే క్రమంలో కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ డైపర్‌ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి.? ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..

Parenting tips: మీ చిన్నారులకు డైపర్స్‌ వేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Parenting Tips
Narender Vaitla
|

Updated on: Nov 11, 2024 | 10:48 AM

Share

ఒకప్పడితో పోల్చితే ప్రస్తుతం డైపర్స్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇకప్పుడు ఎక్కువగా క్లాత్‌ న్యాప్‌కిన్స్‌ ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం కంఫర్ట్‌ కోసం ఎక్కువగా డైపర్స్‌ను ఉపయోగిస్తున్నారు. వాకడం సులభంగా ఉండడం, తక్కువ ధరకే లభిస్తుండడంతో చాలా మంది వీటికి మొగ్గు చూపుతున్నారు. అయితే డైపర్స్‌ను ఉపయోగించే క్రమంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి డైపర్స్‌తో పోల్చితే క్లాత్‌ న్యాప్‌కిన్స్‌ మంచివని నిపుణులు అంటున్నారు. వీటిని ఉపయోగించిన తర్వాత శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెట్టి మళ్లీ ఉపయోగించుకోవవచ్చు. దీంతో వీటి ద్వారా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వంటివి దరిచేరకుండా ఉంటాయి. అయితే డైపర్‌లో ఇలాంటి ఆప్షన్‌ ఉండదు. వీటి ద్వారా ర్యాషస్‌, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ..పిల్లలకు క్లాత్ న్యాప్కిన్స్, డైపర్ల వాడకంపై కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం డైపర్లను, న్యాప్కిన్లను ఎంత సేపటికి మార్చాలనే విషయాలను తెలిపారు. నవజాత శిశువులకు డైపర్లను, న్యాప్కిన్లను ప్రతి గంటకోసారి మార్చాలని చెబుతున్నారు. కాగా 4 నుంచి 5 నెలల పిల్లలకు ప్రతి 3 నుంచి 4 గంటలకోసారి క్లాత్ న్యాప్కిన్‌ను కచ్చితంగా మార్చాలని అంటున్నారు.

ఇక డైపర్‌ను కూడా కచ్చితంగా ప్రతీ 3 గంటలకు ఒకసారి మార్చాలని అంటున్నారు. అయితే మల విసర్జన చేస్తే మాత్రం.. డైపర్‌లోని జెల్‌తో ప్రతిచర్య జరుగుతుంది. దీంతో చిన్నారుల్లో దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మంపై దురద పెరిగి పుండ్లు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల వయసు బట్టి రోజుకు 5 నుంచి 6 డైపర్లను మార్చాలని చెబుతున్నారు. లేదా క్లాత్‌ న్యాప్‌కిన్స్‌ను ఉపయోగించాలి.

ఒకవేళ డైపర్‌లను కచ్చితంగా ఉపయోగించాల్సి వస్తే.. చిన్నారుల చర్మానికి కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఇది మంచి ల్యూబ్రికేషన్‌లాగా ఉపయోగపడి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే చిన్నారులకు తుడవానికి ఎక్కువగా వైప్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులోని ఆల్కహాల్‌ కంటెంట్‌ చర్మంపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుంది. దీనికి బదులు తడి గుడ్డను ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?