
ఇంట్లో వంట చేయడం ఒక సంతోషకరమైన అనుభూతి. ఈ మధ్య కాలంలో అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకొని తింటున్నారు. ఆధునిక యుగంలోని పోకడల వల్ల కొందరు మహిళలు సైతం వంటపై అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనిని నేర్చుకుంటే సృజనాత్మకతను తట్టి లేపినట్లే అవుతుంది. ఈ అనుభూతిని ఆస్వాదించాలంటే వంటలోని కెమిస్ట్రీని రుచి చూడాల్సిందే. అయితే చాలా మంది వండిన ఐటెంను రుచి చూసేందుకు ఇష్టపడతారు. వండే రుచిని ఇష్టపడరు. ఇలాంటి తేలిక పాటి టిప్స్ పాటించడం వల్ల ఎలాంటి భయాందోళనలు లేకుండా వంటలు ఇట్టే వండేయొచ్చు. ప్రమాదాలు, గాయాలను నివారించడానికి వంటగదిలో భద్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. వంట గదిలో సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కిచెన్లో ఎలా పడితే అలా వస్తువులను ఉంచడం వల్ల ప్రమాదాలు సంభవిచే అవకాశం ఉంటుంది. ఒక క్రమబద్దంగా అన్నీ ఒక చోట అమర్చుకోవడం వల్ల వంటగది ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. వండేటప్పుడు అటు ఇటు తిరగడానికి కూడా హాయిగా ఉంటుంది. పిల్లలను ఎత్తుకొని వంట చేసేవారు గాయాల నివారణకు కత్తులు, పదునైన వస్తువులు, బరువైన పాత్రలను పిల్లలకు అందుబాటులో ఉంచకుండా జాగ్రత్తపడాలి. తద్వారా వారికి ఏమవుతుందో అన్న అలోచన లేకుండా మన పని మనం సాఫీగా చేసుకోవచ్చు.
బాక్టీరియా వ్యాప్తి చెందకుండా, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి మీ చేతులను సబ్బుతో బాగా కడగాలి. ఆ తరువాత పచ్చి మాంసాలు, పౌల్ట్రీ , కూరగాయలు శుభ్రంగా తుడిచి ఆరనివ్వాలి. ఆతరువాత ప్రత్యేక కట్టింగ్ బోర్డులను ఉపయోగించండి.
మంటల ప్రమాదాన్ని తగ్గించడానికి పేపరు, టవల్స్, డిష్ టవల్స్, వంట నూనెలు వంటి మండే వస్తువులను స్టవ్‌టాప్‌లు, ఓవెన్‌లు ఇతర ఉష్ణ వనరులకు దూరంగా ఉంచండి. అలాగే వండే క్రమంలో ఫ్లేమ్ ఉన్న సమయంలో లిక్విడ్ లు, క్లీనింగ్ స్ప్రేలు ఉపయోగించకండి. వాటి ద్వారా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. తద్వారా అగ్నిప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
చిన్న పాటి అగ్నిమాపక యంత్రాన్ని వంటగదిలో లేదా సమీపంలో ఉంచండి. కార్భన్ డై యాక్సైడ్ సిలిండర్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని ఒక మూలకు అమర్చుకోండి. ప్రమాదవశాత్తు మంటలు సంభవించినప్పుడు దాని సరైన పద్దతిలో ఉపయోగించండి. మంటలను మెటల్ మూతతో కప్పడం లేదా బేకింగ్ సోడా లేదా ఫైర్ బ్లాంకెట్‌తో అణచివేయండి.
ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల సురక్షితంగా వంటగదిలో మన పని చేసుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా బయటపడవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..