
సాధారణంగా చాలా మంది పిల్లలు గణితం అంటే భయపడి పారిపోతుంటారు. చిన్నారులే కాదు.. టినేజ్ యూత్ సైతం మ్యాథ్స్ అంటేనే దూరంగా ఉండిపోతారు. కొందరు మాత్రమే ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టముంటుంది. చాలా మందికి మ్యాథ్స్ అంటేనే ఓ బోరింగ్ సబ్జెక్ట్ గా ఫీల్ అవుతుంటారు. స్కూల్లో టీచర్స్, ట్యూషన్స్ ఇలా ఎన్ని విధాలుగా మ్యాథ్స్ నెర్పించడానికి ప్రయత్నించినప్పటికీ గణితం అంటే భయం మాత్రం వారిని వదిలిపెట్టదు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పిల్లల చదువు పట్ల శ్రద్ద పెట్టడం చాలా కష్టం. కానీ వారికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ కలిగించాలంటే తల్లిదండ్రులు కొన్ని టిప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. థియరీకి బదులుగా ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా పిల్లలకు సబ్జెక్ట్ పై ఆసక్తి కలిగించవచ్చు. చిన్న చిన్న మార్పుల వలన వారు గణితంలో మేధావులను చేయ్యోచ్చు.
గణితాన్ని అర్థం చేసుకోవడానికి, పిల్లల ప్రాథమిక అంటే ఫండమెంటల్స్ స్పష్టంగా ఉండటం ముఖ్యం. ఫండమెంటల్స్ క్లియర్ చేయడానికి, ఉదాహరణల ద్వారా వివరించాలి. ఒకటి , రెండింటికి బదులుగా, ఆపిల్ , అరటిపండు వంటివి ఉదాహరణగా చూపించాలి. ఇది పిల్లల ఫండమెంటల్స్ క్లియరింగ్‌తో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
కౌంటింగ్ తో గణితాన్ని బోధించడం. పండ్లు , కూరగాయలను కలిపి చెప్పాలి. వాటిని ఒక్కొక్కటిగా వేరు చేయమని.. కౌంట్ చేయమని అడగాలి . పిల్లలు వాటిని గుర్తించి లెక్కపెట్టి వేరు చేస్తారు. దీంతో త్వరగా కౌంటింగ్ నేర్చుకుంటాడు. పిల్లలు స్వయంగా ప్రాక్టీస్ చేస్తే తప్ప గణితం నేర్చుకోలేరు. పిల్లలు నేర్చుకునే అలవాట్లను మెరుగుపరిచే అనేక ఆటలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు ఈ ఆటల సహాయం తీసుకోవచ్చు. పాములు, నిచ్చెనల మాదిరిగా 1 నుండి 100 వరకు కౌంటింగ్ ఉంటుంది. వాటిని స్వయంగా చదవి.. లెక్కించాలి.
పిల్లలు ఆడుకునేందుకు ఇష్టపడతారు. చతురస్రం, వృత్తం, త్రిభుజం వంటి ఆకారంలో ఉండే వస్తువులతో ఆడుకునేలా చేయాలి. ముఖ్యంగా పిల్లలకు అబాకస్ ఉపయోగించి లెక్కింపు.. కౌంట్ చేయడం.. తీసివేయడం నేర్పించాలి. ఏదైనా సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం.. నేర్చుకోవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ప్రాక్టికల్ లెర్నింగ్.. పిల్లలు లెక్కింపు పట్టికలు త్వరగా నేర్చుకుంటారు.