AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon: పుచ్చకాయ పండిదో లేదో.. కోయకుండానే ఎలా తెలుసుకోవాలి.?

ఇదిలా ఉంటే మార్కెట్లో పదుల కొద్ది ఉండే పుచ్చకాయల్లో మంచి పండును ఎంచుకోవడం ఛాలెంజ్‌తో కూడుకున్న పని అవుతుంది. బయటకు బాగానే కనిపించినా, ఇంటికి రాగానే కాయను కట్ చేసి చూస్తే మాత్రం లోపల ఎర్రగా ఉండదు. దీంతో చేసేదేమిలేక పడేయాల్సి వస్తుంది. అయితే కాయను కట్ చేయకుండానే పుచ్చకాయ...

Watermelon: పుచ్చకాయ పండిదో లేదో.. కోయకుండానే ఎలా తెలుసుకోవాలి.?
Watermelon
Narender Vaitla
|

Updated on: Mar 18, 2024 | 4:28 PM

Share

సమ్మర్ వచ్చిందంటే రోడ్లపై ఎక్కడ చూసినా పుచ్చకాయలు దర్శనమిస్తాయి. మండుటెండలో ఊరటనిచ్చే పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా పుచ్చకాయలోని వాటర్‌ కంటెంట్‌ సమ్మర్‌లో డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇదిలా ఉంటే మార్కెట్లో పదుల కొద్ది ఉండే పుచ్చకాయల్లో మంచి పండును ఎంచుకోవడం ఛాలెంజ్‌తో కూడుకున్న పని అవుతుంది. బయటకు బాగానే కనిపించినా, ఇంటికి రాగానే కాయను కట్ చేసి చూస్తే మాత్రం లోపల ఎర్రగా ఉండదు. దీంతో చేసేదేమిలేక పడేయాల్సి వస్తుంది. అయితే కాయను కట్ చేయకుండానే పుచ్చకాయ పండిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పుచ్చకాయ తొడిమ ఉండే ప్రాంతం గట్టిగా ఎండినట్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే పుచ్చకాయ గట్టిగా ఉండే లోపల ఎర్రగా ఉంటుందని అర్థం. మెత్తగా ఉంటే అది లోపల పాడైనట్లు గుర్తించాలి.

* కాయ సైజ్‌తో సంబంధం లేకుండా చేతిలో పట్టుకున్న సమయంలో బరువుగా అనిపించాలి. అలా ఉంటే లోపల నీరు, గుజ్జు ఎక్కువగా ఉన్నట్లు అర్థం.

* ఇక వాసనను బట్టి కూడా మంచి కాయను ఎంచుకోవచ్చు. పుచ్చకాయను ముక్కుకు దగ్గరగా పెట్టుకుని.. వాసన చూస్తే తియ్యటి వాసన వస్తే అది పండినట్లు అర్థం. అయితే మరీ ఎక్కువ వాసన వచ్చినా అది కుళ్లినట్లు అర్థం చేసుకోవాలి.

* పుచ్చకాయను చేతిలోకి తీసుకొని కొట్టి పరీక్షించి కూడా పండో కాదో తెలుసుకోవచ్చు. ఇలా కొట్టినప్పుడు వెదురు కర్ర నుంచి వచ్చిన చప్పుడు వస్తే అది బాగా పండినట్లు అర్థం.

* కొన్ని పుచ్చకాయలపై గోధుమ రంగులో గీతలుంటాయి. ఇవి కూడా బాగా పండిన పండుకు లక్షణమని గుర్తించాలి. చూశారుగా ఈ సింపుల్ టెక్నిక్‌ను పాటించి ఇకపై మంచి పండును ఎంచుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?
30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?
సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?
లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?
కెప్టెన్లకు డార్లింగ్ ఇస్తున్న టార్గెట్ ఏంటి ??
కెప్టెన్లకు డార్లింగ్ ఇస్తున్న టార్గెట్ ఏంటి ??