Heart: మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో హార్ట్ ఎటాక్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండె పోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు సరాదాగా గడిపిన వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలి పోవడం...
ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో హార్ట్ ఎటాక్ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండె పోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు సరాదాగా గడిపిన వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలి పోవడం ఓ రకంగా షాక్‌కి కూడా గురి చేస్తోంది. అయితే జీవన విధానంలో చేసుకునే కొన్ని మార్పుల వల్ల గుండె సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ కచ్చితంగా కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. ఇవి పచ్చని ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా బచ్చలికూర, బ్రోకలీ, మెంతి వంటి ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు, గుండెను బలోపేతం చేస్తాయి.
* యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోజూ డైట్‌లో ఆపిల్, నారింజ, బెర్రీలను భాగం చేసుకుంటే గుండె సమస్యలు దరిచేరవు. ఇవి గుండె ధమనులను శుభ్రంగా ఉంచుతాయి.
* వ్యాయామాన్ని కచ్చితంగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. రోజులో కనీసం 30 నిమిషాలైనా వాకింగ్, రన్నింగ్, సైకిలింగ్ లేదా యోగా వంటివి ఏదైనా ఒకటి అలవాటు చేసుకోవాలి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, అలాగే గుండెను బలపరుస్తాయి. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తే రక్తపోటు తగ్గుతుంది.
* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ కచ్చితంగా బాదం, వాల్‌నట్, చియా గింజలను తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే మంచి కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
* శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరు శరీరంలో నుంచి విష పదార్థాలను బయటకు పంపించడంలో ఉపయోగపడుతుంది. తగినంత నీరు గుండె ధమనులలో అడ్డుపడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* ఇక అన్నింటికంటే ముఖ్యమైంది స్మోకింగ్, మద్యం అలవాట్లకు దూరంగా ఉండడం. గుండెపోటుకు ప్రధాన కారణాలు ఇవే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుండె జబ్బులకు స్మోకింగ్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
* శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజూ ఉదయం ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..