AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటే చాలు.. ఇక హాస్పిటల్‌ చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం జనాలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ఫ్యాటీ లివర్‌ కూడా ఒకటి. ఈ సమస్యను తగ్గించుకొని లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏలాంటి ఆహారాలు తినాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చూద్దాం.

Health Tips: ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటే చాలు.. ఇక హాస్పిటల్‌ చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు!
Fatty Liver Diet Telugu
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Aug 08, 2026 | 5:10 PM

Share

మనం తీసుకునే ప్రతి ఆహారాన్ని, పానీయాన్ని ప్రాసెస్ చేసి, మన శరీరాన్ని విషరహితంగా ఉంచే కీలక అవయవం ఏదైనా ఉందంటే అది మన లివర్. కానీ, ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు మన లివర్‌పై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. ఫలితంగా లివర్ డిసీజెస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. చికిత్స కంటే నివారణ మేలు అనే సామెతను పాటిస్తూ, మీ లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం తినాలో, ఏవి తగ్గించాలో అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఇవే!

  • వెల్లుల్లి, నిమ్మకాయ, అవకాడో ఇవి డిటాక్సిఫికేషన్ ప్రక్రియలో ఎంతగానో సహాయపడతాయి.
  • ఆకుకూరలు, బీట్‌రూట్, క్యారెట్ వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు లివర్‌కు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • గ్రీన్ టీ, పసుపు, వాల్‌నట్స్ ఇవి వాపును తగ్గించి, లివర్ దెబ్బతినకుండా కాపాడుతాయి.
  • యాపిల్స్, ఆలివ్ ఆయిల్, బెర్రీస్ ఇవి శరీరంలోని కొవ్వును నియంత్రించి, లివర్ ఆరోగ్యాన్ని పెంచడానికి మేలు చేస్తాయి.
  • బ్రోకలీ ఇది మొత్తం జీవక్రియను మెరుగుపరుస్తుంది.

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే తినకూడని ఆహారాలు

  • ఆల్కహాల్ ఇదే లివర్‌కు నెంబర్ వన్ శత్రువు. దీని జోలికి వెళ్లకపోవడం చాలా మంచిది. ఆందులోని రసాయనాలు లివర్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
  • చక్కెర పానీయాలు, సోడా, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు వీటిలో ఉండే అధిక కేలరీలు, ట్రాన్స్ ఫ్యాట్స్ లివర్ పనితీరును అడ్డుకుంటాయి.
  • ప్రాసెస్డ్ మీట్, ఫ్యాటీ మీట్ వీటిలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి కూడా తినడం తగ్గించాలి.
  • శుద్ధి చేసిన పిండి పదార్థాలు, అధిక చక్కెర ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, లివర్ ఆరోగ్యానికి హాని చేస్తాయి.
  • ప్యాకేజ్డ్ స్నాక్స్ వీటిలో ప్రిజర్వేటివ్‌లు, అధిక సోడియం ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి.

శరీరాన్ని విష రహితంగా ఉంచేందుకు లివర్ ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ సింపుల్ చార్ట్‌ని గుర్తుంచుకోండి. ఆరోగ్యకరమైన లివర్ మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, మీ లివర్‌ను కాపాడుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.

Follow Us
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
మా తప్పేంటి? భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాలి...!
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే..
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
వన్డే రికార్డుల్లో మాస్టర్ బ్లాస్టర్‌ను దాటేసిన రన్ మెషిన్
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
మీది రోహిణి నక్షత్రమా? అయితే మీలో కృష్ణుడి లక్షణాలు ఉన్నట్లే
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక..
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష
తిరుమలలో సర్పాల సంరక్షణపై టీటీడీ సిబ్బందికి ప్రత్యేక శిక్ష