Benefits of Matsyasana: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. మత్స్యాసనం ఒక్కసారి ట్రై చేసి చూడండి..!

మనిషి ఆధునిక యుగంలో జీవించే విధానంతో జీవన ప్రమాణాలు మారిపోయాయి. తినే తిండి, నిద్రలేమి, మానసిక ఆందోళన ఇవన్నీ కలిసి వయసు సంబంధం లేకుండా అనారోగ్యానికి గురవుతున్నాడు...

Benefits of Matsyasana: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. మత్స్యాసనం ఒక్కసారి ట్రై చేసి చూడండి..!
Matsyasana

Updated on: Mar 16, 2021 | 11:32 AM

Benefits of Matsyasana:  మనిషి ఆధునిక యుగంలో జీవించే విధానంతో జీవన ప్రమాణాలు మారిపోయాయి. తినే తిండి, నిద్రలేమి, మానసిక ఆందోళన ఇవన్నీ కలిసి వయసు సంబంధం లేకుండా అనారోగ్యానికి గురవుతున్నాడు. అందుకనే శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ యోగా, ధ్యానాన్ని చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ లో ఎక్కువమందికి థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైంది. రెండురకాలుగా వేధించే ఈ సమస్యను అదుపులో ఉంచాలంటే… జాగ్రత్తలు తీసుకుంటూనే కొన్ని ఆసనాలు వేయాలి. ఈరోజు మనం మత్య్ససనం గురించి తెలుసుకుందాం..!

యోగాలో ఒక విధమైన ఆసనం మత్స్యాసనం. నీటిలో ఈదే చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది.

ఆసనం వేయు పద్దతి:

ముందుగా రిలాక్స్ గా వార్మప్స్ చేయాలి.
తర్వాత పద్మాసనం వెయ్యాలి. (కుడి కాలిని ఎడమతొడ మీద .. ఎడమకాలిని కుడి తొడ మీద ఉంచి పద్మాసనంలో కూర్చోవాలి)
పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి
రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి.
కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి.
తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేవాలి..
పద్మాసనంలో కొంతసేపు కూర్చొవాలి

మత్స్యాసనం వల్ల కలిగే ప్రయోజనాలు :

ఈ ఆసనం వల్ల మెడకు, ఊపిరితిత్తులకు, పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది.
ఛాతీ పరిమాణం పెరుగుతుంది.
ఊపిరితిత్తులు తాజా ప్రాణవాయువును పీల్చు ఉంచుకునేలా తమ సామర్థ్యతను పెంచుకుంటాయి.
వెన్నెముక బలిష్టంగా తయారవుతుంది. వెన్ను సులభంగా కదిలేలా చేయగలదు .
సరైన స్థితిలో కూర్చోకపోవడం అనే అలవాటునుంచి వెన్ను వంపు భాగాలు సరిదిద్దబడతాయి.
ఈ ఆసనం శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది . థైరాయిడ్ , పారా థైరాయిడ్ గ్రంథుల సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక : బాక్ పెయిన్, కడుపులో పుండు, వరిబీజం కలవారు ఛాతీలో లేదా మెడలో నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ ఆసనం వేయరాదు.

Also Read:

 మనమిద్దరం మనకు ఇద్దరు అంటున్న మోనిత…. దీప జాడను చెప్పే సరికొత్త క్యారెక్టర్ సంతానం ఎంట్రీ

ప్రారంభమైన తెలంగాణ శాసనసభ, శాసన మండలి.. ఈరోజు సభలో పలువురి సంతాప తీర్మానాలతో సరి..