Shalabhasana Benefits : మన ఆలోచనలు, తినే ఆహారం మనసు, శరీర ఆరోగ్యంపై ప్రభావము చూపిస్తుంటాయి. అందుకనే మన పూర్వీకులు యోగా ధ్యానాన్ని మానవాళికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఊపిరితిత్తుల కోసం ప్రాణాయామం..మానసిక స్థిరత్వం కోసం ధ్యానం.. శారీరక పటుత్వం కోసం యోగాసనం మానసిక ఆనందం కోసం మంచిలోచనలను చేయాలనీ చెప్పారు. ఈరోజు యోగాలో ఒక విధమైన ఆసనము శలభాసనం గురించి తెలుసుకుందాం..! ఇది మిడతను పోలిన ఆసనం కనుక దీనికి శలభాసనమని పేరు. శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
శలభాసనం వేయు విధానం:
!. ముందుగా రిలాక్స్ గా బోర్లా పడుకొని రెండు కాళ్ళను దగ్గరగా రెండు చేతులను తొడల క్రింద ఉంచాలి.
2. అనంతరం గడ్డం నేలపై ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి మొదట కుడికాలును మోకాలు వంచకుండా పైకి ఎత్తాలి.
3. ఈ పొజిషన్ లో కొన్ని క్షణాలున్న ఉండాలి.. అనంతరం మెల్లగా కాలు నేలమీదకు మెల్లగా దించాలి.
4. మళ్లీ కుడికాలు ఎత్తిన విధంగానే ఎడమకాలితో కూడా చేయాలి.
5 ఇలా ఒక్కక్క కాలితో మూడేసి సార్లు చేసిన తర్వాత రెండు కాళ్ళను కలిపి ఒక్కసారే పైకి ఎత్తాలి. కొంచెం సేపు ఈ విధంగా ఉండి.. మెల్లగా కిందకు దించాలి. ఇలా రెండు కాళ్లతో మూడుసార్లు చేయాలి. తర్వాత మకరాసనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి.
ఈ ఆసనం వల్ల కలుగు ఆరోగ్య ప్రయోజనాలు :
శలభాసనం పొట్టకు, తుంటి భాగానికి, కాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది.
ఈ ఆసనంతో గర్భసంచి, అండాశయాలలో ఏవైనా లోపాలు వుంటే తొలగుతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
కాళ్ళు, చీలమండ వాపులకు ఉపశమనం లభిస్తుంది.
అజీర్తి, మలబద్ధకాన్ని తొలగిస్తుంది.
నడుము సన్నబడుతుంది.
ఈ శలభాసనం అభ్యసనం చేయడం వల్ల కొవ్వు కరిగి నడుమునొప్పి తగ్గుతుంది.
వెన్నుపూసలు బలపడతాయి.
సియటికా నొప్పులు తగ్గుతాయి.
నరాల వాపు, మొలలు నివారించబడుతాయి.
కాలేయం వేగంగా పనిచేయడానికి దోహదపడుతుంది. కడుపుబ్బరం తగ్గుతుంది.
ఉదరకోశవ్యాధులు, గాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి
గమనిక: అయితే ఈ ఆసనం వేయు సమయంలో శరీరాన్ని సమతుల్యంగా వుంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ల వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీర భాగం నేలనుతాకి వుండాలి. అది కదలకూడదు.మొండెం చక్కగా వుండాలి.
Also Read: