Lighten Dark Underarms Home Remedies: చాలామంది మహిళలు, పురుషులు సహజంగా చేతుల కింద నల్ల మచ్చలతో బాధపడుతుంటారు. డార్క్ అండర్ ఆర్క్స్ వల్ల చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వారు డార్క్ అండర్ ఆర్మ్స్ వదిలించుకోవడానికి మార్కెట్లో లభించే క్రీములను ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు ఇంటి ఇంటి చిట్కాలతోనే చేతుల కింద మచ్చలను నివారించుకోవచ్చుంటున్నారు నిపుణులు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలసుకుందాం..
బేకింగ్ సోడా – బేకింగ్ సోడా దాదాపు ప్రతి ఇంటిలో దొరుకుతుంది. బేకింగ్ సోడా అండర్ ఆర్మ్‌లను తొలగించడానికి ఉత్తమమైనది. ముందు బేకింగ్ సోడాను కొన్ని నీటిలో కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత పేస్ట్‌ను వారానికి రెండుసార్లు మీ అండర్ ఆర్మ్స్‌పై అప్లై చేసి.. స్క్రబ్ చేయండి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే.. చేతుల కింద మచ్చలు పోతాయి.
కొబ్బరి నూనె – ఈ నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెతో ప్రతిరోజూ మీ అండర్ ఆర్మ్స్ మసాజ్ చేయండి. కొంతసేపు స్క్రబ్ చేసి దాదాపు పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
యాపిల్ సైడర్ వెనిగర్ – యాపిల్ వెనిగర్ కొవ్వును తగ్గించడమే కాకుండా చర్మంపై మృతకణాలను నివారిస్తుంది. ఎందుకంటే ఇందులో తేలికపాటి ఆమ్లాలు ఉంటాయి. బేకింగ్ సోడాలో 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేయండి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి.. ఆరిపోయాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ వేసి కలపాలి. ఆ తర్వాత పేస్ట్‌లా తయారు చేయాలి. ఆ పేస్ట్‌ను రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగితే.. మచ్చలు తొలిగిపోతాయి.
నిమ్మకాయ – నిమ్మకాయను సహజ బ్లీచింగ్ గా పనినచేస్తుంది. తలస్నానం చేసే ముందు.. రోజూ నిమ్మకాయను నల్లగా ఉన్న ప్రదేశంలో రెండు మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. అలా చేస్తే.. వారంలో తేడా కనిపిస్తుంది.
Also Read: