Papaya for Face: బొప్పాయి ఫేస్ ప్యాక్ తో ముఖంపై ముడతలకూ చెక్​ పెట్టొచ్చు.. ఎలా అంటే..

|

May 08, 2022 | 8:13 PM

పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద హీనంగా మారుతుందని వ్యాయామ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని టిప్స్(tips) పాటించినా.. ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. బొప్పాయిలో..

Papaya for Face: బొప్పాయి ఫేస్ ప్యాక్ తో ముఖంపై ముడతలకూ చెక్​ పెట్టొచ్చు.. ఎలా అంటే..
Papaya For Face
Follow us on

గ్రామాల నుంచి పట్టణాల వరకు అందరు బిజీ లైఫ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో శరీరం, అందంపై ప్రత్యేక శ్రద్ధ వహించే సమయమే లేకుండా పోతుంది. చిన్న వయసులోనే ముఖంపై(face) ముడతలు వస్తున్నాయి. ముడతలు పడే చర్మం కోసం ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్‌(face pack)లను ఉపయోగించవచ్చు. వయసు పైబడిన వారిలా కనిపిస్తే… పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద హీనంగా మారుతుందని వ్యాయామ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని టిప్స్(tips) పాటించినా.. ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. బొప్పాయి అటువంటి పండు, దీనిని తినడమే కాకుండా ముఖానికి కూడా రాసుకోవచ్చు. ఇది మీ ముఖం మచ్చలు లేకుండా, అందంగా మారుతుంది. ముఖంపై అకాల ముడతలు కూడా మాయమవుతాయి, అయితే ఇప్పుడు మీరు బొప్పాయిని ఎలా అప్లై చేయాలి. ఎంత సేపటి తర్వాత కడిగేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి బొప్పాయిని ముఖానికి ఎలా అప్లై చేయాలి. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ విధంగా బొప్పాయిని ముఖానికి పట్టించాలి 

కొద్దిగా పండిన బొప్పాయిని ఒక గిన్నెలో వేసి ఇందులో అర టీ స్పూన్ బాదం నూనెను మిక్స్ చేసి పొడి చర్మంపై అప్లై చేయండి. మాయిశ్చరైజేషన్ కోసం 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి. పిగ్మెంటేషన్ తగ్గించడానికి పండిన బొప్పాయికి నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడగాలి. చాలు మెరిసిపోయే ముఖం మీ సొంతం.

ఇవి కూడా చదవండి

బొప్పాయిని ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • ముఖంపై గ్లో రావడంతో పాటు ముఖం నుంచి డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
  • వయసు కంటే ముందు ముఖం మీద ముడతలు కూడా క్రమంగా ముగుస్తాయి.
  • ఇది ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్‌ను తగ్గించడంలో కూడా మీకు సహాయపడుతుంది.
  • మీ ముఖం చాలా పొడిగా ఉన్నప్పటికీ, మీరు ప్రయోజనం పొందుతారు.

కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇందులో ఉండే పీచు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీనితో పాటు, బొప్పాయి రెండవ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది బరువును అదుపులో ఉంచుతుంది.

మరిన్ని ఫ్యాషన్ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: Taj Mahal: తాజ్‌మహల్‌లోని ఆ గదులను తెరవండి.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్..

Kitchen Tips: టేస్టీ టేస్టీ పాస్తా కట్‌లెట్.. మీ ఇంట్లోని చిన్నారులకు అదిరిపోయే టిఫిన్ ఇలా చేయండి..