Winter Skin Care: సాధారణంగా చలికాలంలో చర్మ సమస్యలు మరింత తీవ్రంగా వేధిస్తుంటాయి. చర్మం పొడిబారడం.. మొటిమలు.. మచ్చలు వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్లో చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో లభించే అన్ని రకాల కెమికల్ ప్రొడక్ట్ ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండదు. కానీ సహజ వనరులతో ఇంట్లో తయారు చేసే ఫేస్ మాస్క్, క్రీమ్ చర్మ సమస్యలను తగ్గించడంలో మరింత సహయపడతాయి. ఆయుర్వేద నివారణలో వేప ఒక భాగం. వేప, వేపతో చేసే ఉత్పత్తులు.. అనేక సౌందర్య ప్రయోజనాలున్నాయి. చర్మం, జుట్టు సమస్యలను తగ్గించడానికి వేప ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. వేప నుంచి వివిధ రకాల సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ను రోజూ ఉపయోగించడం వలన చర్మంపై మచ్చలను తగ్గించుకోవచ్చు.
వేప, తేనె ఫేస్ మాస్క్..
వేప.. తేనె ఫేస్ మాస్క్ జిడ్డు చర్మాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం వేప ఆకులను తీసుకుని వాటిని గ్రైండ్ చేసి మందపాటి పేస్ట్ గా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖంపై మెడపై అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
వేప, రోజ్ వాటర్ ఫేస్ మాస్క్..
వేపల ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలోని మచ్చలను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ రంధ్రాలను తగ్గించడానికి సహజ టోనర్ గా పనిచేస్తుంది. ఇందుకోసం వేప ఆకులను ఎండబెట్ట.. దానిని మెత్తగా పొడి చేసి అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి పేస్ట్ గా చేయాలి. దీనిని ముఖంపై, మెడపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి.
వేప, కలబంద ఫేస్ మాస్క్..
వేప, కలబంద రెండూ చర్మానికి, జుట్టుకు ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇది చర్మంపై పేరుకుపోయిన జిడ్డును తగ్గిస్తుంది. ఇందుకు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ వేప పొడి, రెండు టేబుల స్పూన్ల కలబంద జెల్ కలపాలి. ముందుగా మీ చర్మాన్ని రోజ్ వాటర్ తో తుడిచి ఆపై ఈ పేస్ట్ అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
వేప.. శనగపిండి ఫేస్ మాస్క్..
ఈ ఫేస్ మాస్క్ మొటిమల సమస్యను దూరం చేసి మచ్చలను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టీస్పూన్ వేప పొడి, కొద్దిగా పెరుగును గిన్నెలో పేస్ట్ గా చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసి.. ఆతర్వాత ఈ మిశ్రమాన్ని మాస్కు లా అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
Also Read: