బిజీ లైఫ్ లో ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ పెట్టడం అందరికీ కష్టమే. ఓ వైపు పని ఒత్తిడి, బాధ్యతల భారం శారీరక ఫిట్‌నెస్ పట్ల శ్రద్ధ పెట్టడంపై కొంచెం కష్టం అవుతుంది. దీంతో శారీరక తీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఊబకాయంతో ఇబ్బంది పడే వారు రోజు రోజుకీ అధికమవుతున్నారు. అంతేకాదు మరోవైపు అనేక వ్యాధులకు గురవుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. బరువు పెరగడం కూడా వీటిల్లో ఒక కారణం. దీంతో బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. యోగ, వ్యాయామం శారీరక బరువుని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం కోసం కుర్చీ సాయంలో కొన్ని రకాల వ్యాయమ పద్దతులను ఆశ్రయించవచ్చు. ఈరోజు అవి ఏమిటో తెలుసుకుందాం..
వ్యాయామం సంఖ్య 1
మీరు క్యాట్ కౌ అనే వ్యాయామంతో దినచర్యను ప్రారంభించాలి. దీని కోసం.. కొద్దిగా ముందుకు జారి.. కుర్చీపై కూర్చుని, రెండు చేతులను పాదాలపై ఉంచండి. ఇప్పుడు శరీరాన్ని నిటారుగా పెట్టి.. భుజాలను వెనక్కి లాగండి. ఈ సమయంలో.. ఛాతీని ముందుకు తీసుకురండి.. ఇలా సుమారు 10 నిమిషాలు ఈ వ్యాయామం చేయండి.
వ్యాయామం సంఖ్య 2
కుర్చీపై కూర్చొని ట్విస్ట్ అనే వ్యాయామం చేయాలి.. అందులో మోకాళ్లను కుడివైపుకు, శరీరాన్ని ఎడమవైపుకు వంచాలి. శరీరాన్ని మెలితిప్పడం ద్వారా శరీరం సాగుతుంది. మీరు ఇంట్లో లేదా కార్యాలయంలో ఎక్కడైనా ఈ వ్యాయామం చేయవచ్చు.
వ్యాయామం సంఖ్య 3
హ్యాంగింగ్ బాడీ అనే వ్యాయామం కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మంచి రెమిడీ. ఇది నేరుగా కొవ్వును కరిగించడంలో మంచి సహాయకరంగా పరిగణించబడుతుంది. ఈ వ్యాయమ భంగిమ కోసం కుర్చీపై కూర్చుని రెండు చేతులతో కుర్చీ హ్యాండిల్స్ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పైకి లేచి.. శరీరాన్ని 90 డిగ్రీల కోణంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఈ వ్యాయామం కనీసం 10 నిమిషాలు రోజుకు రెండు నుండి మూడు సార్లు చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..