AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips to Stop Snoring: గురక సమస్య వేధిస్తుందా… ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో తగ్గించుకోండి ఇలా..!

Tips to Stop Snoring: మనం నిద్రపోతున్న సమయంలో మన పక్కన వారు నిద్రలో గురక పెడుతుంటే..అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే ఈ ఎక్కువ మందిలో...

Tips to Stop Snoring: గురక సమస్య వేధిస్తుందా... ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో తగ్గించుకోండి ఇలా..!
Stop Snoring
Surya Kala
|

Updated on: Apr 08, 2021 | 11:29 AM

Share

Tips to Stop Snoring: మనం నిద్రపోతున్న సమయంలో మన పక్కన వారు నిద్రలో గురక పెడుతుంటే..అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే ఈ ఎక్కువ మందిలో కనిపించే సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది.

ఇది శ్వాసించే సమయంలో సహజంగా ఎదుర్కొనే సమస్య. నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాసపీల్చేటప్పుడు, శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గురకకు దారితీస్తుంది. నిద్రిస్తున్నపుడు శ్వాసతీసుకోవడంలో గాలి సర్కులేట్ అవుతూ ఓకల్ కార్డులను కంపింప చేస్తూ ధ్వని పుట్టిస్తుంది. గాలి అధికమయ్యే కొద్ది ధ్వని అధికమవుతుంది. నిద్రించే సమయంలో నోరు, ముక్కు ద్వారా గాలి సులభంగా పోకపోవడంతో గురకకు కారణం అవుతుంది . అయితే ఈ గురక సమస్య ను ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో పోగొట్టుకోవచ్చు.. అవేంటో తెలుసుకుందాం..!

* రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆ నీటి ఆవిరి పడితే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది. * ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసుకుని రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని పుక్కిలించాలి. * కొద్దిగా పిప్పర్ మెంట్‌ ఆయిల్ ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూడాలి. అలా చేస్తే గురక తగ్గుతుంది. *అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. మంచి ఫలితం కనిపిస్తుంది. *ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక సమస్య తగ్గుతుంది.

ముఖ్యంగా లావుగా ఉన్నవారిలో గురక సమస్య అధికం.. కనుక వారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలాగా అమర్చుకుని నిద్రపోతే.. చాలావరకూ గురక సమస్యను నివారించుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వాటర్‌ రిసోర్స్‌ విభాగంలో ఖాళీలకు నోటిఫికేషన్

అమ్మ గెస్ట్ రూమ్ లో ఎందుకు ఉంది.. ఎవరికి గెస్ట్ అని తండ్రిని నిలదీసిన హిమ..