Happy Birthday Priyanka Chopra: ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సత్తా చాటిన ప్రియాంక చోప్రా.. అనంతరం హలీవుడ్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకుసాగుతోంది. కేవలం సినిమాల్లోనే కాదు ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడంలో ఆరితేరింది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న షాకిచ్చిన సంగతి తెలిసిందే. తనకంటే దాదాపు 10 ఏళ్ళ చిన్నవాడిని పెళ్ళాడి ఈ అమ్మడు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పటి నుంచి హాలీవుడ్‌కే అంకితమైన ప్రియాంక.. తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో సందడి చేసింది. కాగా ప్రియాంక చోప్రా జోనస్ నేడు (జులై18, ఆదివారం) తన 39వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుటుంది. వింత వింత డ్రస్ లతో అందాలపే ఒలక బోసే ప్రియాంక చోప్రా.. వెరైటీ డ్రస్‌లతో అప్పుడప్పుడూ షాక్ ఇస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
హాలీవుడ్ కెరీర్‌పై దృష్టి పెట్టిన బాలీవుడ్ భామ, బిజినెస్‌లోనూ రాణిస్తోంది. ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ బంబుల్‌లో పెట్టుబడులు పెట్టిన ప్రియాంక, న్యూయర్స్ నగరంలో తన సొంత రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించింది. అలాగే సొంత హెయిర్‌కేర్ బ్రాండ్ అనోమలీని సొంతం చేసుకునే పనిలో ఉంది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్‌గా ఎంపికైంది. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రియాంక, అనంతరం సినమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. దాంతో 2003వ సంత్సరంలో ‘దిహీరో’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
ఈ మాజీ మిస్ వరల్డ్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ.. తన ష్యాషన్‌తో మెప్పిస్తూనే ఉంటోంది. నటనలోనే కాదు, డ్రెస్సింగ్ విషయంలోనూ ప్రియాంక చోప్రా స్టైల్ అందరి కంటే భిన్నంగా ఉంటుందనడంలో సందేహం లేదు. వివాహ అనంతరం కూడా సెక్సీ డ్రెస్‌లతో అభిమానులను అలరించడంలో తగ్గేదేలే అంటూ సాగుతోంది. ఫ్యాషన్‌లో తనదైన ముద్ర వేసిన కొన్ని ఫొటోలను చూద్దాం.
Also Read:
Monal Gajjar : నెటిజన్ పై సీరియస్ అయిన బిగ్ బాస్ బ్యూటీ.. కారణం ఏంటో తెలుసా..
Nabha Natesh: మాస్ట్రోలో నితిన్‌తో జతకట్టిన ఇస్మార్ట్ బ్యూటీ.. అందాల నాభా ఆశలన్నీ ఆ సినిమా పైనే..