Tomato Face Packs: ప్రకటనల్లో కనిపించే బ్యూటీలు మెరిసిపోతూ కనిపిస్తుంటారు. వారి ముఖాలను చూస్తుంటే ఇలా.. ఎలా.. అని ఆశ్చర్యపోయే వారు చాలా మందే ఉంటారు. అయితే వారిలా మెరిసిపోవాలంటే ఏం చేయాలి..? ఎలాంటి మేకప్ వాడాలి..? ఇందు కోసం ఎవరి సంప్రదించాలి..? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉత్పన్నం అవుతుంటాయి. ఇలా ముఖానికి ఇంత మెరుపు రావాలంటే కృత్రిమమైన సాధనాలూ, మేకప్లూ అవసరం లేదు. మనకు సహాయం చేసుకోవడానికి అనేక మార్గాలు మన ఇంట్లోనే ఉంటాయి. వాటిని ఉపయోగించి మనం కూడా అందంగా మారవచ్చు. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఇంట్లోనే తయారుచేసుకుని ఉపయోగించుకునే ప్రత్యేక ప్యాక్. ముఖానికి కాంతితోపాటు మృదుత్వాన్ని ఇవ్వడానికి సహాయపడే ఒకటి.
అధిక జిడ్డు:
చర్మం జిడ్డు ఒక అద్భుతమైన నివారణ. చర్మాన్ని తేమగా, మృదువుగా చేయడానికి ఇది అదిరిపోయే మార్గం.
దీని కోసం మీరు మంచి పండిన టమోటాను తొక్కవచ్చు. అందులో తేనె, పసుపు కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. దీన్ని ముఖానికి రాసుకోవచ్చు. వారంలో కనీసం రెండు మూడు రోజులైనా దీన్ని అప్లై చేయడం మంచిది. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు, ముఖంపై ఉన్న మచ్చలను తొలగించేందుకు కూడా ఇది మంచిది. ఇందులోని పసుపు , తేనె మొటిమల వంటి సమస్యలకు ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ ప్రత్యేక ప్యాక్ ఏ రకమైన చర్మానికైనా ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఈ బంధాలను వెంటనే వదిలివేయండి.. కీలక వివరాలను వెల్లడించిన చాణక్యుడు..
Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..!