మన చర్మం శరీరంలోని అన్ని భావాలను ప్రతిబింబించే అతి పెద్ద భాగం.ఇది ఒక రకమైన అద్దం, మీ శరీరంలో ఏదైనా తప్పు జరిగితే అది ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి సమస్య ఒకటి స్కిన్ హ్యాంగోవర్ . దీనిని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైన కారణాలలో ఒకటి ఆల్కహాల్ తాగడం. మీరు అర్థరాత్రి తాగితే అది శరీరంతో పాటు చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది.
ఆల్కహాల్ తాగడం వల్ల నిద్ర లేకపోవడం.. చర్మం డీహైడ్రేషన్, డల్‌గా ఉండటం ఇవన్నీ స్కిన్ హ్యాంగోవర్‌కి సంకేతాలే. కళ్ల కింద వాపు రావడం, నల్లటి వలయాలు ఎక్కువగా కనిపించడం కూడా స్కిన్ హ్యాంగోవర్‌కి సంకేతాలే. రాత్రి ఆలస్యంగా డ్రింక్ తీసుకుంటే మీరు కూడా ఈ లక్షణాలను చూడవచ్చు.
నిజానికి ఆల్కహాల్ మన శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారుతుంది. డీహైడ్రేట్ అయిన చర్మం డల్‌గా రంగు మారినట్లు కనిపిస్తుంది. స్కిన్ హ్యాంగోవర్ గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే.. అది తర్వాత అనేక చర్మ సమస్యలకు దారి తీస్తుంది. ఆల్కహాలిక్ డ్రింక్స్‌లోని చక్కెర కొల్లాజెన్ అనే గ్లైకేషన్ అనే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఎలాస్టిన్ ఫైబర్‌ల విచ్ఛిన్నానికి కారణమవుతుంది. చక్కెర ఆండ్రోజెన్ హార్మోన్లు, సెబమ్‌ల స్రావాన్ని కూడా పెంచుతుంది. ఇది మొటిమలకు దారి తీస్తుంది. చర్మం, చర్మ రంధ్రాలు పెద్దవి కావడం ప్రారంభిస్తాయి. నిరంతరంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.. వయసుకు ముందే వృద్ధాప్యం రావడం మొదలవుతుంది. చర్మంలో మార్పులు కనిపించడం ప్రారంభించినప్పుడు.. వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తాం. ఇది ఈ సమస్యను మరింత తీవ్రంగా చేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం