మగవారికి కుడి కన్ను, స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే శుభసూచికమని అంటుంటారు. కానీ తరచుగా కళ్లు అదురు తుంటే దీనిని సీరియస్ సమస్యగా పరిగణించాలి. అలాంటి సమస్యను విస్మరించవద్దు. వెంటనే సమీపంలోని కళ్ల వైద్యుడిని సంప్రదించాలి. నిజానికి, కళ్లు పదేపదే అదురుతున్నట్లు అనిపించడానికి ప్రధాన కారణం శరీరంలో అతి ముఖ్య మినరల్ మెగ్నీషియం లోపం కావచ్చు. మెగ్నీషియం లోపం కారణంగా కంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలాగే బలమైన ఎముకలు, కండరాల నిర్మాణానికి మెగ్నీషియం చాలా ముఖ్యమైన ఖనిజం. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ మెగ్నీషియం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల కళ్లు అదరడంతో పాటు అనేక ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. దీని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో మెగ్నీషియం లోపాన్ని ఎలా గుర్తించాలంటే..
వాస్తవానికి.. మెగ్నీషియం శరీరం కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఖనిజం లోపం తలెత్తినప్పుడు కండరాల ఉద్రిక్తత పెరుగుతుంది. దీనివల్ల కళ్లు అదరడం సమస్య తలెత్తుతుంది. మెగ్నీషియం లోపం వల్ల తరచుగా తలనొప్పి కూడా సంభవిస్తుంద. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
పని చేసినప్పుడు అలసటగా అనిపించడం సాధారణమే. కానీ మెగ్నీషియం లోపం ఉన్నవారికి మాత్రం ఏ కొద్దిపాటి పని చేసినా బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. అంతేకాకుండా, ఆకలి తీరులో కూడా మార్పు వస్తుంది. వాంతులు, ఆకలి లేకపోవడం, వికారం వంటి సమస్యలను కలిగిస్తుంది.
కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఖనిజాలు అవసరమవుతాయి. కాబట్టి శరీరంలో మెగ్నీషియం లోపం తలెత్తితే తరచూ కాళ్లల్లో తిమ్మిరి కనిపిస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు వస్తే శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్లననే విషయాన్ని గ్రహించాలి.
మెగ్నీషియం ప్రేగుల్లో నీటి నిల్ల శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. తరచుగా మలబద్ధకం సమస్యలు ఉంటే, ఇది మెగ్నీషియం లోపానికి సంకేతమని గ్రహించాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.