Refined Wheat Flour : మైదా పిండి వంటకాలు తింటున్నారా..? ఎంత డేంజరో తెలిస్తే జన్మలో ముట్టరు..!

మైదా మన ఆరోగ్యానికి ఎంత హానిక‌ర‌మో తెలుసా..? మ‌నం బయట తినే చాలా రకాల ఆహారాల్లో మైదా పిండినే ఎక్కువ‌గా ఉపయోగిస్తుంటారు. గోధుమ పిండిలోని ఫైబ‌ర్‌ను పూర్తిగా తొల‌గించి రీఫైన్ చేసి ఈ మైదా పిండిని త‌యారు చేస్తారు. అందువ‌ల్ల మైదా పిండిలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అంతే తప్ప మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మనం తింటున్న తెల్లటి విషం ఈ మైదా అంటున్నారు నిపుణులు. మైదా వల్ల కలిగే నష్టాలు తెలిస్తే ఇకపై అస్సలు ముట్టరుగాక ముట్టరు..

Refined Wheat Flour : మైదా పిండి వంటకాలు తింటున్నారా..? ఎంత డేంజరో తెలిస్తే జన్మలో ముట్టరు..!
Maida Flour

Updated on: Nov 04, 2025 | 9:59 PM

మైదాను తరచూ తింటూ ఉండటం వల్ల దీర్ఘ‌కాలంలో షుగ‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే షుగ‌ర్ ఉన్న‌వారు మైదాను తింటే షుగ‌ర్ మ‌రింత పెరిగి ప్రాణాపాయం సంభ‌వించే ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. క‌నుక మైదా మ‌న‌కు పూర్తిగా హానిక‌రం అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

పిండి ప‌దార్థాల‌ను అధికంగా తీసుకుంటే శ‌రీరంలో ఇన్సులిన్ నిరోధ‌క‌త పెరుగుతుంది. దీంతో శ‌రీరం ఉత్ప‌త్తి చేసే ఇన్సులిన్‌ను క‌ణాలు స‌రిగ్గా గ్ర‌హించ‌లేవు. దీని వల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. దీర్ఘ‌కాలంలో ఇది డ‌యాబెటిస్‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా బ‌రువు పెర‌గ‌డంతోపాటు టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది.

అలాగే మైదాను తింటే ఆక‌లి అంత త్వ‌ర‌గా తీర‌దు. దీంతో ఆహారం మ‌రింత‌గా తింటారు. దీని వ‌ల్ల శ‌రీరం శ‌క్తిని కోల్పోయినట్లు అవుతుంది. నీర‌సంగా మారుతారు. అల‌స‌ట‌గా అనిపిస్తుంది. అలాగే మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక మైదాకు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిద‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మైదాతో త‌యారు చేసిన ఆహారాల‌ను తిన‌కుండా మ‌న‌స్సును డైవ‌ర్ట్ చేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఆయా ఆహారాల‌కు బ‌దులుగా పండ్లు, నట్స్‌, విత్త‌నాల‌ను తినాలి. ఇవి ఆక‌లిని త‌గ్గించ‌డ‌మే కాదు, పోష‌కాల‌ను కూడా అందిస్తాయి. శ‌రీర బ‌రువు త‌గ్గేందుకు, షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండేందుకు స‌హాయం చేస్తాయి. రోగాల‌ను త‌గ్గించ‌డంలో దోహద ప‌డ‌తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..