ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా..? డోంట్ వర్రీ..! ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయిపోండి..

ఆవలింతలు రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. కాబట్టి ప్రతిరోజూ 8 గంటల పాటు నిద్రపోండి. నిద్ర కోసం స్థిరమైన షెడ్యూల్‌ ఏర్పాటు చేసుకోండి. దీంతో ఆవలింతలు తగ్గుతాయి. ఆవలింతలు ఎక్కువగా వచ్చినప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోండి. డీప్‌ బ్రీత్ వల్ల బ్లడ్‌ సర్కులేషన్‌ పెరుగుతుంది. కణాలకు ఆక్సిజన్‌ అందుతుంది.

ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయా..? డోంట్ వర్రీ..! ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయిపోండి..
Yawning

Updated on: Sep 27, 2025 | 10:15 PM

ఆవలింతలు రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. కాబట్టి ప్రతిరోజూ 8 గంటల పాటు నిద్రపోండి. నిద్ర కోసం స్థిరమైన షెడ్యూల్‌ ఏర్పాటు చేసుకోండి. దీంతో ఆవలింతలు తగ్గుతాయి. ఆవలింతలు ఎక్కువగా వచ్చినప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోండి. డీప్‌ బ్రీత్ వల్ల బ్లడ్‌ సర్కులేషన్‌ పెరుగుతుంది. కణాలకు ఆక్సిజన్‌ అందుతుంది. ఆవలింతలు తగ్గుతాయి. ఆవలింతలు వచ్చినప్పుడు ముఖాన్ని వాష్‌ చేసుకోండి. దీని వల్ల ఆవలింతలు తగ్గుతాయి. తాజా ఫీల్‌ పొందవచ్చు.

ఆవలింతలు ఎక్కువగా వచ్చినప్పుడు కాసేపు వాకింగ్‌ చేయండి. 5 నుంచి 10 నిమిషాల పాటు వాకింగ్‌ చేయడం వల్ల అలసట తగ్గుతుంది. ఆవలింతలు కంట్రోల్ అవుతాయి. ఆల్కాహాల్ సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా రాత్రిపూట ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల నిద్ర సరిగా రాదు. ఇది ఆవలింతలకు కారణం అవుతుంది. డీహైడ్రేషన్‌ బారిన పడటం వల్ల కూడా ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఎక్కువగా నీరు తాగండి.

నీరసం వల్ల కూడా ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శరీరంలో శక్తి స్థాయిలు పెంచుకోండి. ఇందుకోసం అన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌ ఉన్న ఆహారాల్ని తినండి. ఒత్తిడి పలు సమస్యలు కారణం అవుతుంది. ఒత్తిడి పెరగడం వల్ల ఆలసట వస్తుంది. ఇది ఆవలింతలకి కారణం అవుతుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం చేయండి. కాఫీ, చక్కెర ఎక్కువగా పానీయాలు తాగడాన్ని తగ్గించండి. ఇవి మీలో శక్తిని తగ్గిస్తాయి. ఆవలింతలకి కారణం అవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.