Egg White vs Egg Yellow: గుడ్డు ఎల్లో vs గుడ్డు వైట్.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యం..

|

Oct 04, 2024 | 3:15 PM

ఎంతో ఆరోగ్యకరమైన పోషకాహారాల్లో గుడ్డు కూడా ఒకటి. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. గుడ్డులో ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో శరీరం బలంగా, దృఢంగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చిన్న పిల్లలు ప్రతి రోజూ గుడ్డు తింటే వారి ఎదుగుదలలో మంచి ఫలితం కనిపిస్తుంది. గుడ్డును సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రోటీన్లు లభిస్తాయి. ప్రోటీన్ కావాలి అనుకునేవారు..

Egg White vs Egg Yellow: గుడ్డు ఎల్లో vs గుడ్డు వైట్.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యం..
Egg White Vs Egg Yellow
Follow us on

ఎంతో ఆరోగ్యకరమైన పోషకాహారాల్లో గుడ్డు కూడా ఒకటి. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. గుడ్డులో ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో శరీరం బలంగా, దృఢంగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. చిన్న పిల్లలు ప్రతి రోజూ గుడ్డు తింటే వారి ఎదుగుదలలో మంచి ఫలితం కనిపిస్తుంది. గుడ్డును సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రోటీన్లు లభిస్తాయి. ప్రోటీన్ కావాలి అనుకునేవారు గుడ్డును తింటే సరిపోతుంది. ఆరోగ్య పరంగా కూడా గుడ్డు ఎంతో మంచిది. గుడ్డు తినడం వల్ల చర్మం, జుట్టు, శరీరం హెల్దీగా ఉంటాయి. అయితే చాలా మంది గుడ్డులో వైట్ మంచిదని లేదా ఎల్లో మంచిదని అంటూ ఉంటారు. మరి ఇందులో ఏది తింటే హెల్త్‌కి బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డులోని ఎల్లో:

గుడ్డులోని ఎల్లోలో అనేక పోషకాలు లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఈ పసుపు భాగంలో ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, శరీరానికి చాలా అవసరం. ఈ పచ్చ సొనలో లుటిన్, జియాక్సంతిన్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అయితే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలి అనుకునేవారు ఎల్లో తినవచ్చు. ఇది జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

గుడ్డులోని వైట్:

గుడ్డులో ఎక్కువ భాగం తెలుపునే ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. ప్రోటీన్ కంటెంట్ కావాలి అనుకునే వారు ఈ గుడ్డులోని తెలుపు భాగాన్ని తినవచ్చు. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారికి బెస్ట్. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. కండరాలు బలంగా ఉండాలంటే గుడ్డులోని తెలుపు భాగం తినడం బెటర్.

ఇవి కూడా చదవండి

ఏది తింటే బెటర్:

గుడ్డు పోషకాహారం. గుడ్డును ఎలా తిన్నా మంచిదే. అయితే ఎవరి అవసరాలను బట్టి వారు గుడ్డును తీసుకుంటూ ఉంటారు. గుడ్డును వేర్వేరుగా కాకుండా మొత్తం గుడ్డును తినడం మంచిది. తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన లభాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..