శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. మనదేశంలో 10 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించడానికి రోజూ మందులు తీసుకోవల్సి ఉంటుంది. అయితే చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి కొన్ని యోగా ఆసనాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు దీనిపై పరిశోధనలు చేశారు. రోజూ 50 నిమిషాల యోగా చేయడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని వీరి పరిశోధనలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీలోని AIIMSలోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ పునీత్ మిశ్రా ఏం చెబుతున్నారంటే.. యోగా చేయడం వల్ల షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహ రోగులు 3 నెలల పాటు యోగా చేయడం వల్ల వారి శరీరంలో హెచ్‌బి1ఏసీ స్థాయి గణనీయంగా తగ్గింది. ఈ రోగులకు మందులతో పాటు యోగా కూడా చేయించారు. మరి కొంతమంది రోగులతో యోగా చేయించలేదు. యోగా చేసిన వారి షుగర్ స్థాయి అదుపులో ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనలో 50 నిమిషాల యోగా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధాన యోగాసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలన్నీ రోజూ ఒక్కో నిమిషం చొప్పున వేయాలి..
మార్జారి ఆసనాన్ని క్యాట్ పోజ్ అని కూడా అంటారు. ఇందులో ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులను తొడలపై ఉంచాలి. పాదాలను భుజం-వెడల్పు వేరుగా ఉంచాలి. తర్వాత మోకాళ్లపై నిలబడాలి. రెండు చేతులను ముందుకు ఉంచి చాపపై వేళ్లను తెరిచి ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ నడుముని క్రిందికి వత్తి ఊపిరి పీల్చుకుంటూ నడుమును పైకి తేవాలి. ఈ ప్రక్రియను 30-35 సార్లు చేయాలి. యూట్యూబ్‌లో కూడా ఈ ఆసనం చూడొచ్చు.
కటిచ్క్రాసనం చేయడానికి, ముందుగా నిటారుగా నిలబడి, రెండు కాళ్లను భుజం వెడల్పులో తెరవండి. రెండు చేతులను కుడి,ఎడమ వైపులా ఉంచి, శ్వాస తీసుకుంటూ, చేతులను ముందు వైపుకు పైకి లేపాలి. వాటిని భుజాలకు అనుగుణంగా ఉంచాలి. ఇప్పుడు నడుమును కుడి వైపుకు తిప్పాలి. ఆ తర్వాత రెండు చేతులను కుడి వైపుకు తీసుకొని కుడివైపుకి తాకడానికి ప్రయత్నించాలి. ఎడమ వైపుకు కూడా ఇలాగే చేయాలి.
ఈ ఆసనం వేయడానికి, ముందుగా లేచి నిలబడి చేతులను శరీరం దగ్గర ఉంచాలి. కుడి చేతిని భుజాల ముందుకి తీసుకుని ముందుకు లాగాలి. శ్వాస తీసుకుంటూ చేతులను పైకెత్తి చెవుల దగ్గరకు తీసుకెళ్లాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఎడమవైపుకు వంగాలి.. కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉండి, ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా మళ్లీ మామూలుగా నిలబడాలి.
AIIMS తన పరిశోధనల ఆధారంగా విడుదల చేసిన 50 నిమిషాల యోగా ఆసనాలు, విధానాల జాబితాను అనుసరిస్తే, షుగర్ స్థాయి అదుపులో ఉంటుందని డాక్టర్ పునీత్ చెప్పారు.