Snails Uses: నత్తలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. షాక్ అవ్వక తప్పదు!

|

Sep 17, 2024 | 12:45 PM

నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసే ఉంటుంది. చాలా చోట్ల నత్తల కూరలు తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. నత్తలతో తయారు చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. గోదావరి నదీ ఒడ్డున ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటారు. నాన్ వెజ్ తినేవారికి వీటి గురించి బాగా తెలుసు. వీటితో చేసే వంట కూడా చాలా రుచిగా ఉంటుంది. పలు ఫేమస్ రెస్టారెంట్లలో కూడా వీటిని ఎక్కువగా వండుతూ ఉంటారు. నత్తలతో వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పటి జనరేషన్‌కు తెలియక..

Snails Uses: నత్తలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. షాక్ అవ్వక తప్పదు!
Snail uses
Follow us on

నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసే ఉంటుంది. చాలా చోట్ల నత్తల కూరలు తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. నత్తలతో తయారు చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. గోదావరి నదీ ఒడ్డున ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటారు. నాన్ వెజ్ తినేవారికి వీటి గురించి బాగా తెలుసు. వీటితో చేసే వంట కూడా చాలా రుచిగా ఉంటుంది. పలు ఫేమస్ రెస్టారెంట్లలో కూడా వీటిని ఎక్కువగా వండుతూ ఉంటారు. నత్తలతో వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పటి జనరేషన్‌కు తెలియక పోవచ్చు. కానీ మీ ఇంట్లో పెద్దలకు ఈ నత్తల కూర గురించి బాగా తెలిస్తుంది. నత్తల కర్రీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

వర్షాలు పడిన తర్వాత లభిస్తాయి..

ఈ నత్తలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కేవలం వర్షాలు పడిన తర్వాత మాతమ్రే ఎక్కువగా లభిస్తాయి. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ నత్తలను ప్రత్యేకంగా పెంచుతారు. వీటితో అనేక వెరైటీ వంటలు కూడా చేస్తూ ఉంటారు. ఈ నత్తలను పేదవారి మాంసంగా చెబుతూ ఉంటారు.

వీరికి బెస్ట్:

కొన్ని రకాల సమస్యలతో బాధ పడేవారు నత్తలు తినడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడొచ్చు. శ్వాస కోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు, ఫైల్స్ ఉన్నవారు నత్తలను తినవచ్చు. ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడేవారు తింటే మరింత మంచిది. ఈ నత్తలను తినడం వల్ల గుండెకు కూడా చాలా మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నత్తల్లో పోషకాలు:

నత్తల్లో ఎక్కువ శాతం అంటే 82 శాతం నీరే ఉంటుంది. ఇనుము, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, నియాసిన్, సెలీనియం వంటివి ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.

అతి తక్కువ ధరకే..

నత్తల మాంసం చాలా మెత్తగా ఉంటుంది. మేక మాంసం కంటే ఈ నత్తలతో చేసిన కర్రీ చాలా రుచిగా ఉంటుందట. గర్భిణీలు, చిన్న పిల్లలు, రక్త హీనత సమస్యతో ఉన్నవారు ఈ నత్తలు తినడం చాలా మంచిది. అంతే కాకుండా ఇవి అతి తక్కువ ధరకే లభిస్తాయి. చేపలు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో.. నత్తలు తినడం వల్ల కూడా అంతే బెనిఫిట్స్ అందుతాయని నిపుణులు అంటున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..