Mango Pickle: మామిడికాయ పచ్చడి తింటే బరువు తగ్గడం ఖాయం..

|

Dec 20, 2024 | 3:40 PM

ఊరగాయ తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అంటారు. కానీ ఆవకాయ పచ్చడి తినడం వల్ల ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఆర్టికల్ చదివితే మీకే అర్థమవుతుంది. ఆవకాయ పచ్చడి భారతీయ సంప్రదాయానికి పెట్టింది పేరు. ఇది తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు..

Mango Pickle: మామిడికాయ పచ్చడి తింటే బరువు తగ్గడం ఖాయం..
Mango Pickle
Follow us on

మామిడి కాయ పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆవకాయ అంటేనే నోరూరిపోతుంది. మే నెలలో పెట్టే ఈ పచ్చడికి ఎంతో ప్రాధాన్యత, ప్రాచూర్యం ఉంది. పూర్వ కాలం నుంచి కూడా ఊరగాయ పెట్టడం భారతీయుల సంప్రదాయం. ప్రాంతాలను బట్టి ఊరగాయ పెట్టే విధానంలో మార్పులు, రుచులు ఉంటాయి. కానీ ఆవకాయ పెట్టడం మాత్రం కామన్. మామిడితో చేసే ఈ నిల్వ పచ్చడికి విదేశీయులు కూడా దాసోహం అయిపోయారు. ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు ఎంత అన్నం అయినా తినవచ్చు. వెన్న లేదా నెయ్యి వేసుకుని తింటే ఆహా కమ్మగా గొంతుకులోనుంచి దిగిపోతుంది. వేడి వేడి అన్నంలో మామిడి పచ్చడి వేసుకుని తింటుంటే.. చెబుతుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. స్పైసీగా, పుల్లగా నోటికి రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి. ఊరగాయ తింటే ఎక్కువగా వేడి చేస్తుందని అంటారు. కానీ ఊరగాయ తింటే వచ్చే లాభాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.

జీర్ణ సమస్యలు ఉండవు:

ఊరగాయ పచ్చడిలో కలిపేవి అన్నీ పోషకాలు ఉన్న పదార్థాలే. కాబట్టి ఊరగాయ పచ్చడి తింటే జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఊరగాయ పచ్చడి వేసుకుని రెండు తింటే చాలు. అజీర్తి, మల బద్ధకం సమస్యలు తగ్గతాయి.

వెయిట్ లాస్:

ఈ పచ్చడి తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. తక్కువగా తిన్నా ఎక్కువగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. తద్వారా బరువు తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్ కరుగుతుంది:

ఊరగాయ పచ్చడి తినడం వల్ల శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా.. శరీరంలో పేరుకు పోయిన మలినాలు, కొవ్వును బటయకు పంపుతాయి.

తక్షణమే శక్తి:

ఆవకాయ పచ్చడి కలుపుకుని తింటే శరీరానికి తక్షణమే శక్తి కూడా లభిస్తుంది. ఇందులో ఉండేవి అన్నీ ఆరోగ్యకరమైన పదార్థాలే కాబట్టి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బయట దొరికే జంక్ ఫుడ్స్‌తో పోల్చితే ఆవకాయ మేలు.

చర్మం – ఎముకలకు మంచిది:

ఊరగాయ పచ్చడిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, విటమిన్ కె లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను దృఢంగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి.

చలికాలం – వర్షా కాలంలో తింటే మంచిది:

మే నెలలో ఆవకాయ పచ్చడి పెట్టేది చలికాలం, వర్షా కాలంలో తినడానికే. ఈ సమయంలో శరీరం మొత్తం చల్లబడిపోతుంది. వాతావరణంలో కూడా ఉష్ణోగ్రత లెవల్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఊరగాయ తింటే శరీరంలో వేడిని పెంచుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.