Health Tips: తొందర తొందరగా తింటున్నారా.. అయితే ఈ ప్రమాదాలు పొంచి ఉన్నట్లే.. కారణం ఏమిటంటే..

|

Jan 14, 2023 | 8:05 AM

ప్రస్తుతం మనం పాటిస్తున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి తినే తీరిక కూడా ఉండడంలేదు. ఉద్యోగ జీవితం బాధ్యతలు, వాటి ద్వారా కలిగే ఒత్తిడి కారణంగానే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో..

Health Tips: తొందర తొందరగా తింటున్నారా.. అయితే ఈ ప్రమాదాలు పొంచి ఉన్నట్లే.. కారణం ఏమిటంటే..
Early Morning Eating
Follow us on

ప్రస్తుతం మనం పాటిస్తున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి తినే తీరిక కూడా ఉండడంలేదు. ఉద్యోగ జీవితం బాధ్యతలు, వాటి ద్వారా కలిగే ఒత్తిడి కారణంగానే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో కొందరు వేగంగా తింటుంటారు. ఇలా తినడం మంచిది కానే కాదు. వారికి తినడానికి సరైన సమయం ఉండకపోవడం లేదా మరేదైనా కారణం అయ్యుండవచ్చు. కానీ ఇలా వేగంగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. మనలో చాలా మంది ఈ రకమైన జీవనశైలికి అలవాటుపడినవారు. నిదానంగా కాకుండా వేగంగా తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక స్థూలకాయం, అధిక బరువు, మధుమేహం, బలహీనత వంటివి కూడా వెంటాడే ప్రమాదం ఉంది. అసలు వేగంగా తినడం వల్ల కలిగే  సమస్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. వేగంగా తినడం వల్ల మన శరీరానికి పోషకాలు సరైన రీతిలో అందవు. ఎందుకంటే త్వరగా ఆహారాన్ని తిన్నప్పుడు దానిని సరిగా నమలకుండా మింగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీర జీర్ణవ్యవస్థపై అధిక భారం పడుతుంది. అంతేకాక పూర్తి స్థాయిలో ఆహారం జీర్ణం కాకపోవడం కారణంగా శరీరానికి కావలసిన శక్తి కూడా అందదు.
  2. తొందర తొందరగా ఆహారం తినడం వల్ల కడుపు నిండిందా లేక ఇంకా ఏమైనా తినాలా, తినడం ఆపేయాలా అనే సంకేతాలు సరైన సమయంలో మెదడుకు చేరవు. ఆ క్రమంలో ఎక్కువగా తినేస్తుంటాం. ఫలితంగా ఊబకాయం సమస్య తెరమీదకు వస్తుంది.
  3. వేగంగా భోజనం చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణ సమస్య వస్తుంది.
  4. వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
  5. ఇవి కూడా చదవండి
  6. చాలా త్వరగా ఆహారం తిని ముగించేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. కనుక ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలని వైద్యులు చెబుతున్నారు.
  7. పలు అధ్యయాల ప్రకారం వేగంగా తినేవారిలో షుగ‌ర్ సమస్య వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  8. వేగంగా తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణమవదు. ఫలితంగా శరీరానికి కావలసిన పోషకాలు సరిపడా అందక పోషకాహారలోపం ఏర్పడే ప్రమాదం ఉంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..