Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోండి..
ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఏమవుతుంది..? అరటిపండులో ఉండే శక్తి, ఫైబర్, ముఖ్యమైన పొటాషియం వల్ల అది గుండెకు ఎంత మంచిదో తెలుసా? బరువు తగ్గడానికి, జీర్ణశక్తి పెరగడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారు..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అరటిపండ్లు అత్యంత పోషక విలువలున్న పండ్లలో ఒకటి. వీటిలో ఉండే ఖనిజాలు, ఫైబర్, సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదా..? కాదా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. పోషకాహార నిపుణురాలు డాక్టర్ శిల్పా అరోరా ప్రకారం.. అరటిపండ్లు పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం యొక్క అద్భుతమైన మూలం. అందుకే ఇవి రోజువారీ శరీర అవసరాలకు తగిన పోషకాలను అందిస్తాయి.
ఖాళీ కడుపుతో అరటిపండు ప్రయోజనాలు
తక్షణ శక్తి, తగ్గించిన ఆకలి
అరటిపండులో దాదాపు 98 కేలరీలు, 4 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఉదయం దీన్ని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఇది బరువు నియంత్రణకు కూడా దోహదపడుతుంది.
జీర్ణవ్యవస్థకు మేలు
అరటిపండ్లలో కరిగే ఫైబర్ పెక్టిన్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉబ్బరం, అసిడిటీ వంటి కడుపు సమస్యలను తగ్గిస్తాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ
అరటిపండుతో పాటు గుప్పెడు నట్స్ కలిపి తినడం మంచిది. అరటిపండులోని ఫైబర్, చక్కెర రక్తంలో కలిసే ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీని ద్వారా ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి కీలకం
అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం అనే రెండు ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 2023 పరిశోధన ప్రకారం.. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అందుకే ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవడం అనేది కండరాలు, నరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు మీ పేగు ఆరోగ్యాన్ని, జీవక్రియను పెంచేందుకు ఒక మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




