పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి రోజు ఏదో ఒక పూట పండ్లు తినడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు అందంగా కూడా ఉండొచ్చునని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అయితే, చాలా మంది కొన్ని రకాల పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్స్ రూపంలో చేసుకుని తింటుంటారు. అలాంటి వారు కొన్ని నియమాలను తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, కొన్ని రకాల పండ్లను కొన్నింటితో కలిపి తినకూడదు. అలా తింటే ఆరోగ్యం కాదు.. అనారోగ్యం తప్పదంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో అరటి పండు, బొప్పాయి కూడా ఉన్నాయి.
అన్ని రకాల పండ్లు వాటి స్వంత స్వభావం కలిగి ఉంటాయి. విభిన్న స్వభావం గల రెండు రకాల పండ్లను కలిపి తినడం వల్ల అవి ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు నిపుణులు. . ఆయుర్వేదం ప్రకారం అరటి, బొప్పాయి పండు కలిపి తినడం ప్రమాదకరం అంటున్నారు. గుండె, పొట్ట ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, మధుమేహానికి మేలు చేస్తుంది. ఈ రెండు పండ్లను విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. కానీ కలిపి తినడం వల్ల శరీరానికి హాని చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఆయుర్వేదం ప్రకారం, అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు పదార్థాలను కలిపి తింటే జీర్ణశక్తి క్షీణించి తలనొప్పి, వాంతులు, తల తిరగడం, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు అంటున్నారు నిపుణులు. ఆస్తమా లేదా శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదని చెబుతున్నారు. బొప్పాయి తినడం వల్ల అలర్జీ వస్తుంది. అంతే కాకుండా మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి తినకూడదని చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..