AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ragi Laddoo Recipe: కొండలను పిండి చేసే బలం కావాలా?.. ఈ లడ్డూ రోజుకు ఒక్కటి తినండి చాలు..

రాఖీ పండుగ వచ్చేసింది.. మీ అన్నయ్య లేదా తమ్ముడికి రాఖీ కట్టి ఏం స్వీట్ ఇవ్వాలో అని ఆలోచిస్తున్నారా?.. అయితే ఇంట్లోనే తయారు చేసే రుచిరమైన ఈ రాగీ లడ్డూను ఇవ్వండి. ఇది మీ సోదరులకు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ స్పెషల్ లడ్డూ మీ రాఖీ పండగను మరింత స్పెషల్‌గా మారుస్తుంది.

Ragi Laddoo Recipe: కొండలను పిండి చేసే బలం కావాలా?.. ఈ లడ్డూ రోజుకు ఒక్కటి తినండి చాలు..
Rakhi Special Sweets
Anand T
|

Updated on: Aug 27, 2026 | 8:30 PM

Share

రక్షాబంధన్.. ఈ పవిత్ర పండుగ అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల మధ్య విడదీయరాని ప్రేమకు ప్రతీక. ఈ ప్రత్యేక సందర్భంలో, ప్రతి సోదరి తన సోదరుడు కలకాలం సంతోషంగా ఉండాలని రాఖీ కడుతూ స్వీట్‌తో నోటిని తీపి చేస్తుంది. అయితే ప్రస్తుతం కాసులకు కక్కుర్తి పడి చాలా మంది కల్తీ స్వీట్లు తయారు చేస్తున్నారు. కాబట్టి మార్కెట్లో దొరికే కల్తీ స్వీట్లకు బదులుగా, ఈ సారి ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి లడ్డూలను తయారు చేయండి. ఇవి మీ సోదరుల నోటిని తీపి చేయడంతో పాటు వాళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి ఈ రాగి లడ్డూలను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

రాగి లడ్డూల తయారీకి కావలసిన పదార్థాలు

  • రాగి పిండి
  • నెయ్యి
  • బెల్లం లేదా ఖర్జూరాలు (తీపికి తగినంత)
  • డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం మొ.)

రాగి లడ్డూ తయారీ విధానం

స్టెప్-1: ఇంట్లోనే రాగి అడ్డూలు తయారు చేసుకునేందుకు రాత్రంతా రాగులను నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిని ఎండబెట్టి అవి పొడిగా మారిన తర్వాత పిండి పట్టించుకోవాలి. ఒక వేళ మీకు టైం లేకుండా మార్కెట్‌ నుంచి నేరుగా రాగి పిండిని కూడా కొని తెచ్చుకోవచ్చు.

స్టెప్-2: ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై బాణలి పెట్టి అందులో స్వచ్ఛమైన నెయ్యి వేసి కాసేపు వేడి చేయండి. నెయ్యి కరిగి నూనె రూపంలోకి వచ్చాక అందులో రాగి పిండిని వేసి దోరగా, మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించుకోవాలి ఇందులో నూనె అస్సలు వాడకూడదు.

స్టెప్-3: అయితే లడ్డూ తీయగా వచ్చేందుకు ఆరోగ్యం దృష్ట్యా అందులో మీరు చక్కెర బదులుగా బెల్లం లేదా ఖర్జూరాలను గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్‌పై మళ్లీ ఓ బనాలి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ను దోరగా వెయించుకోవాలి. ఒక వేళ మీరు ఇంట్లోని పెద్దల కోసమైతే డ్రై ఫ్రూట్స్‌ను పొడి చేసి వేయడం మంచిది.

స్టెప్-4: అన్ని వేసిన తర్వాత ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో కాస్త నెయ్యి వేసుకుంటూ చేతిలో గుండ్రంగా చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోండి. ఈ లడ్డూలు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే తక్కువ ఖర్చుతో, ఎటువంటి కల్తీ లేకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్వీట్ సిద్ధం అయినట్టే వీటని రాఖీ కట్టిన మీ సొదరుడికి తినిపించి ఈ పండగను ప్రత్యేకంగా జరుపుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us