Tourism Seasonal Offers: ఇక టూరిస్టులకు పండగే.. టూర్ ప్యాకేజీ బుకింగ్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్స్..! వివరాలు
EaseMyTrip: తాజాగా ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ఈజ్‌మైట్రిప్ గ్రాండ్ సీజనల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆజాదీ మెగా సేల్‌గా పేర్కొన్న ఈ సేల్‌లో అందించే డిస్కౌంట్లు ఆగస్టు 1న ప్రారంభమై ఆగస్టు 10న ముగుస్తాయి. ఈ సేల్‌లో భాగంగా అంతర్జాతీయ, దేశీయ విమానాలు, హోటల్‌లు, క్యాబ్‌లు, బస్సులు, క్రూయిజ్‌లు, హాలిడే ప్యాకేజీలపై ప్రత్యేక తగ్గింపులు ఉంటాయి. ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న అనేక ఇతర డిస్కౌంట్ ఎంపికలతో పాటు చెల్లింపు ప్రక్రియ సమయంలో కస్టమర్‌లు 'EMTAZAADI' కూపన్ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా అదనపు తగ్గింపును పొందవచ్చు.

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఇటీవల కాలంలో ప్రతి అవసరానికి యాప్స్ ద్వారా బుక్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు ట్రైన్, బస్, ఫ్లైట్ టికెట్లు కూడా ఆయా యాప్స్ సాయంతో బుక్ చేసుకోవడం అలవాటుగా మారింది. దీంతో చాలా యాప్స్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ఈజ్‌మైట్రిప్ గ్రాండ్ సీజనల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆజాదీ మెగా సేల్‌గా పేర్కొన్న ఈ సేల్‌లో అందించే డిస్కౌంట్లు ఆగస్టు 1న ప్రారంభమై ఆగస్టు 10న ముగుస్తాయి. ఈ సేల్‌లో భాగంగా అంతర్జాతీయ, దేశీయ విమానాలు, హోటల్‌లు, క్యాబ్‌లు, బస్సులు, క్రూయిజ్‌లు, హాలిడే ప్యాకేజీలపై ప్రత్యేక తగ్గింపులు ఉంటాయి. ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న అనేక ఇతర డిస్కౌంట్ ఎంపికలతో పాటు చెల్లింపు ప్రక్రియ సమయంలో కస్టమర్‌లు ‘EMTAZAADI’ కూపన్ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
వినియోగదారులు విమాన బుకింగ్‌లు, హోటల్ బుకింగ్‌లపై కొన్ని అద్భుతమైన డీల్స్‌ను ఈజ్‌మైట్రిప్ ప్రకటించింది. అలాగే కొన్ని అదనపు తగ్గింపులను పొందేందుకు వినియోగదారులు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి బుకింగ్‌లు చేయవచ్చు. అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటీష్ ఎయిర్‌వేస్, మలేషియన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, ఎయిర్ సీషెల్స్, ఈజిప్ట్ ఎయిర్, ఎయిర్ అరేబియా అబుదాబి, అనేక ఇతర ఎయిర్‌లైన్స్‌తో సహా పలు విమానయాన సంస్థల్లో ఫ్లైట్ బుకింగ్‌పై ఈ సేల్ సమయంలో కస్టమర్‌లు తగ్గింపు ధరల ప్రయోజనాన్ని పొందవచ్చు. లీలా, వెల్‌కమ్‌హెర్టియేజ్, స్టెర్లింగ్, ఫెర్న్, లార్డ్స్ హోటల్, ఎంపీటీ, స్ప్రీ హోటల్స్, ప్రైడ్ హోటల్స్, ఉదయ్ సముద్ర గ్రూప్ మరెన్నో సహా ప్రత్యేకంగా ఎంచుకున్న హోటళ్లపై కూడా తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి.
భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ మెగా సేల్‌తో కస్టమర్లకు బుకింగ్ సౌలభ్యాన్ని అందిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. ఈ సేల్‌తో అన్ని వర్గాల వారు భారీ తగ్గింపులను పొందవచ్చని పేర్కొంటున్నారు. ఈ సేల్‌లో ముఖ్యంగా ట్రావెల్ బుకింగ్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చని వివరిస్తున్నారు.



మరిన్ని జీవనశైలి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..




