Nails Biting: గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఇది తెలిస్తే ఇక జన్మలో అలా చేయరు.. భయంకరమైన నిజం మీకోసం..
పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. చాలా మంది ఒత్తిడి సమయంలో తమ గోళ్లు కొరుతుంటారు. ఇది మామూలుగా అనిపించినా.. వీలైనంత త్వరగా ఈ అలవాటును మానుకోవాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇది వ్యసనంగా మారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా దంతాలకు తీవ్ర నష్టం..

ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాట్లలో కొందరికి గోళ్లు కొరికే అలవాటు సర్వసాధారణం. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. చాలా మంది ఒత్తిడి సమయంలో తమ గోళ్లు కొరుతుంటారు. ఇది మామూలుగా అనిపించినా.. వీలైనంత త్వరగా ఈ అలవాటును మానుకోవాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇది వ్యసనంగా మారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా దంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు.
గోళ్లు ఎందుకు కొరుకుతారు..?
గొళ్లు కొరకడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక సిద్ధాంతం ప్రకారం.. ప్రజలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి వారి గోళ్లను కొరుకుతారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదని, ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తున్నారు.
గోళ్లు కొరకడం వల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదం..?
గోళ్లు కొరకడం వల్ల పిల్లలు, యుక్త వయస్కుల వారికి ఎక్కువ ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 40 శాతం మంది పిల్లలు, 50 శాతం మంది యువకులు తమ గోళ్లు కొరుకుతారని సర్వేలు చెబుతున్నారు.




గోళ్లు కొరకడం వల్ల దంతాలు దెబ్బతింటాయి..
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. గోళ్లు కొరకడం వల్ల దంతాలు చీలిపోయే లేదా పగుళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాదు.. దంతాలు మూలాలు పుచ్చుపట్టే ప్రమాదం ఉంది. ఇది దంత క్షయం ప్రమాదాన్ని పెంచుతుంది. గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారికి బ్రక్సిజం వచ్చే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. బ్రక్సిజమ్ అంటే.. పళ్లు కొరకడం. చాలా మంది నిద్రలో ఇలా చేస్తుంటారు. ఇది తలనొప్పి, ముఖంపై నొప్పి, దంత క్షయానికి దారి తీస్తుంది.
గోళ్లు కొరకడం వల్ల కలిగే ఇతర ప్రమాదాలు..
గోళ్లు కొరకడం వల్ల దంతాలు దెబ్బతినడమే కాకుండా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గోళ్లు కొరకడం వల్ల దంతాలలో ఈకోలీ, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన వ్యాధికారక బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తీవ్రమైన జీర్ణశయాంతర వ్యాధికి కారణమవుతుంది. అంతేకాదు.. నిరంతరం గోళ్లను కొరికే వ్యక్తులకు పరోనిచియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఫింగర్ ఇన్ఫెక్షన్, వాపు, వేళ్లలో చీము పట్టడం వంటి సమస్యలు వస్తాయి.
గోరు కొరికే అలవాటును ఎలా వదిలించుకోవాలి..
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ గోళ్లు కొరికే అలవాటును మానడానికి కొన్ని సలహాలు, సూచనలు చేసింది. వీటిని పాటించడం ద్వారా ఆ అలవాటును మానేయొచ్చని చెబుతున్నారు.
• గోళ్లను పొడవుగా పెరగనివ్వవద్దు. వీలైనంత తక్కువగా ఉంచాలి.
• గోళ్లపై నెయిల్ పాలిష్ వేయాలి.
• గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు.. వెంటనే వేరే పని గానీ, మరేదైనా ఆలోచన గానీ చేయాలి.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




